Abdul Razzaq: 2023 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన తర్వాత పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పించారు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉండటం గమనార్హం. పాక్ జట్టు లీగ్ దశలోనే ఎలిమినేట్ అయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాకిస్థాన్‌ను ఓడించింది. ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన తర్వాత పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పించారు. విమర్శించిన వారిలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కూడా ఉన్నాడు. జట్టును విమర్శిస్తూనే అన్ని హద్దులు దాటాడు.
Also Read: Virat Kohli: చారిత్రాత్మక సెంచరీ.. సచిన్ ఆశీస్సులు తీసుకున్న కోహ్లీ
ఓ ఓపెన్ డిబేట్‌లో మాజీ క్రికెటర్లు ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిదిలతో కలిసి రజాక్ మాట్లాడాడు. క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ పట్ల చెత్త వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ.. అబ్దుల్ రజాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ‘ ఐశ్వర్య రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటే.. అందమైన, పవిత్రమైన పిల్లలు పుడుతారనుకుంటే పొరబడినట్లే’ అంటూ హద్దులు దాటాడు .అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మీ దేశం నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఫైర్ అవుతున్నారు. ఒక స్త్రీ పట్ల ఇలా మాట్లాడటం సిగ్గు చేటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఐశ్వర్య రాయ్ ఇంట్లో బాత్‌రూమ్‌లు క్లీన్ చేయడానికి కూడా పనికిరావు అంటూ రజాక్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అబ్దుల్ రజాక్ ఐశ్వర్యరాయ్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు.
Also Read: IND vs NZ: చెలరేగిన కోహ్లీ, శ్రేయస్.. న్యూజిలాండ్ లక్ష్యం@398
పాకిస్థాన్‌కు చెందిన సమా న్యూస్ ఛానెల్‌లో అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ, “మేము క్రికెట్ కోచింగ్, ఉద్దేశాల గురించి మాట్లాడుతున్నాము. నా టంగ్ స్లిప్ అయింది.. నేను అనుకోకుండా ఐశ్వర్య రాయ్ పేరు తీసుకున్నాను. నేను ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను, నా ఉద్దేశ్యం ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదు.” అని రజాక్ క్షమాపణలు చెప్పాడు. రజాక్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ డిబేట్‌లో షాహిద్ అఫ్రిది, గుల్ కూడా ఉన్నారు. రజాక్ నోటి వెంట ఒక్కసారిగా ఐశ్వర్య రాయ్ పేరు రావడంతో మొదట షాక్ తిన్న షాహిద్ అఫ్రిది.. ఆ తర్వాత నవ్వుతూ చప్పట్లు కొట్టడం గమనార్హం. రజాక్‌తో పాటు గుల్, అఫ్రిదిల తీరుపై భారత అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు.