NTV Telugu Site icon

Abdul Razzaq: ‘నా నోరు జారింది.. క్షమించండి’.. ఐశ్వర్యరాయ్‎కి అబ్దుల్ రజాక్ క్షమాపణలు

New Project (1)

New Project (1)

Abdul Razzaq: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వరల్డ్ కప్ లో తమ జట్టు ఘోర వైఫల్యం, తమ దేశ క్రికెట్ బోర్డు తీరును విమర్శించే క్రమంలో, ఏ మాత్రం సంబంధంలేని ఐశ్వర్యా రాయ్ గురించి ప్రస్తావించాడు. ప్రస్తుతం ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. జట్టు సభ్యుల్లోనూ, బోర్డులోనూ సంకల్పమే సరిగా లేదని చెబుతూ… ఐశ్వర్యా రాయ్‎ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారా? అంటూ అసందర్భ ప్రేలాపనలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై భారత్ లోనే కాదు, పాకిస్థాన్ లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. అతని ప్రకటన వైరల్ కావడంతో భారతీయ అభిమానులు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తన ప్రకటనతో కంగుతిన్న రజాక్ క్షమాపణలు చెప్పాడు. తన టంగ్ స్లిప్ అయ్యిందని, అలాంటి ఉద్దేశం తనకు లేదని రజాక్ చెప్పాడు. అబ్దుల్ రజాక్ ప్రకటనపై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్ళు కూడా అతనిని విమర్శించారు.

Read Also:Gold Price Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. తులం ఎంతంటే?

ఐశ్వర్యరాయ్‌కు సంబంధించి తన ప్రకటనకు సామా టీవీలో క్షమాపణలు చెబుతున్నప్పుడు, అబ్దుల్ రజాక్.. ‘నిన్న విలేకరుల సమావేశంలో క్రికెట్ గురించి చర్చ జరిగింది. కోచింగ్ గురించి చర్చ జరిగింది. నా నాలుక జారింది. నేను ఇంకో ఉదాహరణ చెప్పాలనుకున్నాను, కాని ఐశ్వర్య జీ పేరు నా నోటి నుండి జారిపోయింది. నేను క్షమాపణలు కోరుతున్నాను. ఇది నా ఉద్దేశ్యం కాదు. నేను ఇంకో ఉదాహరణ చెప్పాలనుకున్నాను. కానీ ఇది నా నోటి నుండి జారిపోయింది. నేను క్షమాపణలు కోరుతున్నాను.’ అన్నారు. ఐశ్వర్య రాయ్ గురించి అబ్దుల్ రజాక్ ఈ వివాదాస్పద ప్రకటన ఇచ్చిన తర్వాత, షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ వంటి మాజీ క్రికెటర్లు ఉన్నారు. రజాక్ వ్యాఖ్యకు వారంతా నవ్వుతూ కనిపించారు. అయితే, షాహిద్ అఫ్రిదీ తర్వాత వెనుదిరిగి ‘నాకు అర్థం కాలేదని నాకు తెలియదు’ అని చెప్పాడు.

Read Also:CM KCR Tour: నేడు బోధన్, నిజామాబాద్, ఎల్లారెడ్డిలలో సీఎం కేసీఆర్ పర్యటన

Show comments