NTV Telugu Site icon

Abdul Aziz: కోటంరెడ్డిని పెట్టి మహానటుడు మూవీ తీయాలి

Shaik Abdul Aziz 1024x576

Shaik Abdul Aziz 1024x576

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీలోనే నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే స్థాయి నేతలు కూడా స్వంత పార్టీపైన, కొంతమంది వ్యక్తుల పైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వీటిపై కామెంట్ చేశారు. వ్యంగ్యంగా తనదైన రీతిలో విమర్శలు చేశారు. రాజకీయంగా తనను ఎదగనీయకుండాc కుటుంబాల పాలన చేస్తున్నారని చెబుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన తమ్ముడిని కాబోయే ఎమ్మెల్యేగా ఎలా పరిచయం చేశారని అబ్దుల్ అజీజ్ ప్రశ్నించారు.

Read Also: Honda Activa H-Smart: మార్కెట్లోకి హోండా యాక్టివా హెచ్-స్మార్ట్..ఫీచర్స్ అదుర్స్

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డి తనకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కారుస్తున్నారు. మహానటి సినిమాలా శ్రీధర్ రెడ్డిని పెట్టి మహానటుడు అనే సినిమా తీయాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే చేసే సహాయం ఏముంటుంది…? తట్టలో ఇసుక.. సిమెంట్ మోస్తారా…? లే ఔట్ లో పిచ్చి మొక్కలు పీకుతారా? శ్రీధర్ రెడ్డికి ఎటువంటి కళ్ళాలు వేయకుండా ఆంబోతు ను వదిలినట్లు ప్రజల పైకి జగన్ వదిలేశారు..శ్రీధర్ రెడ్డి ఏ పెద్ద రెడ్లను విమర్శిస్తున్నాడో వారి కంటే పెద్ద ఇంద్రభవనాలు కడుతున్నాడు. కాలుష్యం పేరుతో రైస్ మిల్లర్లపై ఉద్యమం చేసి.. ఇంటికి మూట రాగానే ఉద్యమం ఆపేశారు. కంటి తుడుపు చర్యగా నలుగురు కార్యకర్తలకు సహాయం చేసి, వందల కోట్లు దోచేశారు.

Read Also: Honda Activa H-Smart: మార్కెట్లోకి హోండా యాక్టివా హెచ్-స్మార్ట్..ఫీచర్స్ అదుర్స్