Abacus Overseas Education Fair: హైదరాబాద్: వేగంగా గ్లోబలైజ్ అవుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ విద్య విద్యార్థులకు అకాడెమిక్ ప్రతిభ, ప్రపంచస్థాయి అనుభవం మరియు మెరుగైన ఉపాధి అవకాశాలకు బలమైన పునాదిగా మారుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనిఆశించే విద్యార్థుల కోసం అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026 ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
GVMC Council Chaos: జీవీఎంసీ కౌన్సిల్లో కూటమి, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట.. పలువురికి గాయాలు
ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026 జనవరి 31న నగరంలోని హయత్ ప్లేస్, బంజారాహిల్స్ (జీవీకే వన్ మాల్ ఎదురుగా) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా యూరప్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా తదితర ప్రముఖ విదేశీ విద్యా గమ్యస్థానాల్లోని విశ్వవిద్యాలయాల ప్రతినిధులు విద్యార్థులకు ప్రత్యక్షంగా మార్గదర్శనం చేయనున్నారు.
విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు నమ్మకమైన సమాచారం, అడ్మిషన్ ప్రక్రియ, వీసా విధానాలు, స్కాలర్షిప్ అవకాశాలు, ఫీజు మినహాయింపులు తదితర అంశాలపై నిపుణుల సలహాలు ఈ ఫెయిర్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే విద్యార్థుల విద్యా అర్హతల ఆధారంగా వ్యక్తిగత కౌన్సెలింగ్ మరియు ప్రొఫైల్ మూల్యాంకనం కూడా ఉచితంగా నిర్వహించనున్నారు.
Sai Abhyankkar : తమిళ సెన్సేషన్ సాయి అభ్యంకర్.. ఇక వాళ్ళు దుకాణం సర్దుకోవాల్సిందే.
ఈ ఫెయిర్ విద్యార్థులు మరియు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల మధ్య వారధిగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. విదేశీ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమానికి ప్రవేశం పూర్తిగా ఉచితం.