NTV Telugu Site icon

Aaron Finch: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆరోన్ ఫించ్

Fi1

Fi1

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 2020లో ఆస్ట్రేలియా జట్టు తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవడంలో ఫించ్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించాడు. 2024 టీ20 ప్రపంచకప్ వరకు తాను ఆడలేనని గ్రహించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని ఎంసీజీ మైదానంలో వెల్లడించాడు.

Also Read: Shehbaz Sharif: భారత్‌కి పాక్ ప్రధాని బెదిరింపు.. పాదాల కింద నలిపేస్తాడట!

“నేను 2024 టీ20 ప్రపంచకప్​లో ఆడలేనని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో రిటైర్ అవడం కంటే ఇప్పుడే రిటైరవ్వడం సరైన సమయమని భావించాను. తద్వారా జట్టుకు భవిష్యత్ నాయకుడిని తయారు చేసుకోవడానికి సమయం లభిస్తుంది. నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచినందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు, సహచరులకు, సహాయ సిబ్బందికి, నా కుటుంబానికి కృతజ్ఞతలు. అలాగే అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. 2020లో టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్ గెలవడం నా కెరీర్‌లో మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి” అని ఫించ్ పేర్కొన్నాడు.

ఫించ్​ కెరీర్‌లో మొత్తం 146 వన్డేల్లో 5,406 పరుగులు చేశాడు. అందులో 17 సెంచరీలు, 30 అర్ధసెంచరీలు ఉన్నాయి. 103 టీ20లు ఆడి 2 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు సహా 3,120 పరుగులు సాధించాడు. 5 టెస్టు మ్యాచుల్లో 278 పరుగులు చేశాడు. తన కెప్టెన్సీలో టీ20ల్లో జట్టుకు ప్రపంచకప్​ను అందించాడు. 2015 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో ఫించ్ కీలకపాత్ర పోషించాడు. మరో నాలుగు రోజుల్లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలు కాబోతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్ కోసం ఇప్పటికే అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత రెండుసార్లూ ఓడిపోయిన ఆసీస్ ఈ సారి ఎలాగైనా ఇండియాను దెబ్బతీయాలని ఎదురుచూస్తోంది.

Also Read: Human Sacrifice in Chennai: కన్యాకుమారిలో ఘోరం.. చిన్నారి నరబలికి ప్రయత్నం