NTV Telugu Site icon

Aaron Finch: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆరోన్ ఫించ్.. జెర్సీ నెంబర్ 5కి రిటైర్మెంట్! ఇదే తొలిసారి

Aaron Finch Bbl

Aaron Finch Bbl

Aaron Finch announced his retirement from Cricket: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఫించ్.. తాజాగా క్రికెట్ మొత్తానికి గుడ్ బై చెప్పాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2024లో భాగంగా శనివారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్, మెల్‌బోర్న్ స్టార్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచే ఫించ్ కెరీర్‌లో చివరిది. బీబీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి 13 సీజన్లుగా మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఫించ్‌కు ఆ ప్రాంచైజీ ఘనమైన వీడ్కోలు ఇచ్చింది.

బీబీఎల్ మొత్తం 13 సీజన్‌లలో ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ఏకైక ఆటగాడు ఆరోన్ ఫించ్ మాత్రమే. 11 సీజన్‌లలో సార‌థిగా వ్యవ‌హ‌రించిన ఫించ్.. రెండు సీజన్‌లలో ఆటగాడిగా కొనసాగాడు. ఏళ్ల పాటు జట్టుకు ఆడిన ఫించ్‌కు మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ యాజమాన్యం అరుదైన గౌర‌వం క‌ల్పించింది. గార్డ్ ఆఫ్ హానర్‌గా ఫించ్ జెర్సీ నెంబర్ 5కి రిటైర్మెంట్ ప్రక‌టించింది. ఇక‌పై 5వ నెంబర్ జెర్సీని గ్యాల‌రీలో ఉంచనున్నారు. బిగ్‌బాష్ లీగ్ చ‌రిత్ర‌లోనే ఓ ఆట‌గాడి జెర్సీని మ‌రెవ‌రికీ కేటాయించ‌క‌పోవ‌డం ఇదే తొలిసారి.

Also Read: IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన భారత్! కళ్లన్నీ కోహ్లీపైనే

ఆరోన్ ఫించ్ చివరి మ్యాచ్ సందర్భంగా డాక్‌ల్యాండ్స్ స్టేడియాన్ని తమ జెర్సీ రంగు (ఎరుపు రంగు)లోకి మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ మార్చేసింది. చివరిసారిగా గ్రౌండ్‌లోకి ఎంట్రీ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. అయితే తన చివరి మ్యాచులో ఫించ్ డకౌట్ అయ్యాడు. మూడు బంతులు ఆడి ఒక్క పరుగు చేయకుండానే అతడు పెవిలియన్ చేరాడు. మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ జట్టు మాత్రం విజయం సాధించింది. దీంతో సంతోషంగా ఫించ్ తన కెరీర్‌ను ముగించాడు. ఫించ్ సారథ్యంలో మెల్‌బోర్న్‌ ఒకసారి చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. బీబీఎల్‌ టోర్నీలో ఫించ్ 106 మ్యాచుల్లో 3,311 ప‌రుగులు చేశాడు.

 

Show comments