IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన భారత్! కళ్లన్నీ కోహ్లీపైనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG 2nd T20 Prediction and Playing 11: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి టీ20లో గెలిచిన రోహిత్ సేన.. సిరీస్‌పై కన్నేసింది. రెండో టీ20లో గెలిచి మరో మ్యాచ్ ఉండగానే.. సిరీస్ పట్టేయాలని చూస్తోంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, చిన్న బౌండరీలు ఉండడంతో హోల్కర్ స్టేడియంలో పరుగుల వరద ఖాయం. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
భారత తుది జట్టులో స్వల్ప మార్పులు జరగనున్నాయి. గత మ్యాచ్ ఆడని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేడు బరిలోకి దిగుతున్నాడు. 2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో అఫ్గాన్‌పైనే సెంచరీతో సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు విరాట్ ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే జట్టుపై రాణించి.. టీ20 జట్టులో తన ఎంపిక సరైందేనని చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. విరాట్ రాకతో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. తొలి టీ20లో రోహిత్ శర్మ కెప్టెన్సీతో ఆకట్టుకున్నా.. బ్యాటింగ్‌లో పరుగులు చేయలేకపోయాడు. దాంతో రోహిత్, కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది.
Also Read
- YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
- Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
- Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
ఓపెనర్ యశస్వి జైస్వాల్ గాయం నుంచి కోలుకుంటే తుది జట్టులోకి వస్తాడు. లేదంటే శుభ్‌మన్ గిల్‌కు మరో అవకాశం దక్కుతుంది. తొలి టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శివమ్ దూబెపై మరోసారి అందరి దృష్టి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జితేశ్ శర్మ, రింకు సింగ్‌లు మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. గత మ్యాచ్‌లో విఫలమైన సుందర్ స్థానంలో కుల్దీప్ వచ్చే అవకాశం ఉంది. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా 11కు పైగా ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. తన సొంత మైదానంలో అవేశ్‌ను ఆడించాలనుకుంటే రవి డగౌట్‌కే పరిమితం చేయొచ్చు.
తొలి టీ20ల్లో మంచి ప్రదర్శనే చేసిన అఫ్గానిస్థాన్.. ఈ మ్యాచ్‌లో కూడా పోటీ ఇవ్వనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మరింత మెరుగ్గా రాణించి.. పుంజుకోవాలని చూస్తోంది. గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్‌లతో బ్యాటింగ్ బాగానే ఉంది. మిడిలార్డర్లో రహ్మత్ స్థానంలో హిట్టర్ హజ్రతుల్లా జట్టులోకి రానున్నాడు. మరోసారి స్పిన్నే బలంగా నమ్ముకుంటోంది. ముజీబ్, నబీలపై భారీ అంచనాలు ఉన్నాయి. పేసర్లు ఫజల్, నవీన్, గుల్బదిన్‌లు భారత్ బలమైన బ్యాటింగ్ లైనప్‌ను ఎంత వరకు నిలువరిస్తారనేది చూడాలి.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్, గిల్/యశస్వి, కోహ్లీ, దూబె, జితేశ్, రింకు, అక్షర్, సుందర్/కుల్దీప్, బిష్ణోయ్/అవేశ్, అర్ష్‌దీప్, ముకేశ్.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్/హజ్రతుల్లా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబి, గుల్బాదిన్ నయీబ్, కరీం జనాత్, ఫజల్ ఫరూఖీ, నవీనుల్ హక్, ముజీబ్.
తాజావార్తలు
-
YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Oppo Pad Mini: భారత్‌లో Oppo Pad Mini లాంచ్.. 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
-
Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
-
Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య