NTV Telugu Site icon

political heat on currency notes : తెగని నోట్ల పంచాయితీ.. ఆప్, బీజేపీ మధ్యలో కాంగ్రెస్

2000

2000

political heat on currency notes : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల వేళ కరెన్సీ నోట్లపై ముద్రించే చిత్రాల వివాదం ముదురుతోంది. కరెన్సీ నోట్లపై దేవతామూర్తులైన గణేష్, లక్ష్మీదేవి చిత్రాలు ముద్రించాలంటూ ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మను ముద్రించాలనే డిమాండ్‭ను కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. అంబేద్కరిస్టులు సహా కొంత మంది లౌకిక వాదులు ఈ డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అసలు నోటుపై ఎవరిదైనా చిత్రాన్ని ముద్రించాలంటే అన్ని విధాలా అర్హుడైన వ్యక్తి అంబేద్కరేనని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. అయితే 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నుంచి.. ఇలాంటి డిమాండ్ రావడం పట్ల కొంత ఆశ్చర్యం, కొంత ఆసక్తిని రేపుతోంది.

Read Also: PM Modi: కింద పోలీస్ స్టేషన్.. పైన ఇళ్లు.. మోదీ సార్ ప్లాన్ అదుర్స్

కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మనీష్ తివారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘కొత్త సిరీస్ కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో ఎందుకు ఉండకూడదు? నోటుకు ఒకవైపు ఘనతవహించిన మహాత్మా గాంధీ బొమ్మ, మరో వైపు డాక్టర్ అంబేద్కర్ బొమ్మ ఉండాలి. అహింస, రాజ్యాంగవాదం, సర్వసమానత్వం విశిష్ట సమ్మేళనంలో లీనమవుతాయి. అలాంటపుడు ఆధునిక భారతీయ బుద్ధి కుశలత అత్యంత కచ్చితమైన రీతిలో వ్యక్తమవుతుంది’’ అని రాసుకొచ్చారు.

భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు ముద్రించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా ఓ ముస్లిం దేశం..అక్కడ హిందువులు కేవలం రెండు శాతం మాత్రమే ఉంటారు. అటువంటి ఇండోనేషియా కరెన్సీపై హిందూ దేవుడైన గణేషుడు బొమ్మను ముద్రించారని..అటువంటిది మన భారత కరెన్సీపై దేవతల బొమ్మలు ముద్రించాలని కోరారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ ఈ ప్రతిపాదన చేశారు.

Read Also: Jammu Kashmir: ఆ గ్రామంలో ఉన్న ఒక్క మహిళ వెళ్లిపోయింది.. ఇప్పుడు ఏంటి పరిస్థితి?

1969లో తొలిసారి గాంధీ శత జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రాలున్న నోట్లు అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు గుళ్లు, గోపురాలు,, ఉపగ్రహాలు, ఆనకట్టల వంటివి ముద్రించారు. 1935లో ఆర్బీఐ ఏర్పాటయ్యాక 1938లో తొలిసారిగా రూపాయి నోటు ముద్రించింది. 1949లో జాతీయ చిహ్నమైన నాలుగు సింహాలు, అశోక స్థూపాన్ని నోట్లపై ముద్రించారు.

Show comments