NTV Telugu Site icon

Aam Admi Party: రాజస్థాన్‌ ఎన్నికల్లోనూ ఆప్.. 200 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు

Aam Admi Party

Aam Admi Party

Aam Admi Party: ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్‌ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొనడం ఖాయమనిపిస్తోంది. ఆప్ ఎన్నికల వ్యూహకర్త సందీప్ పాఠక్ పార్టీ రాజస్థాన్ యూనిట్ నాయకులు, వాలంటీర్లతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఆప్ విజయాన్ని సాధించేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు. రాజస్థాన్‌లో ఆప్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి వినయ్‌ మిశ్రా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఆప్‌ను బలోపేతం చేసేందుకు పార్టీ చేయాల్సిన పనులపై సమీక్షించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.

Jagadish Reddy : బీఆర్‌ఎస్‌ సంక్షేమంలో దేశ దిశను మారుస్తుంది

పంజాబ్‌లో అద్భుతమైన విజయం సాధించిన వెంటనే, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ రాజస్థాన్‌లో తన స్థావరాన్ని బలోపేతం చేసుకోవడానికి మెగా కసరత్తు ప్రారంభించింది. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గత 8 నెలల్లో రాజస్థాన్‌లో ఆప్ రాష్ట్ర యూనిట్ ఇప్పటివరకు చేసిన పనులను సమీక్షించామని ఆప్ సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ కూడా రాజస్థాన్‌లోని పార్టీ నాయకులు, వాలంటీర్‌లతో సమావేశాలు నిర్వహించి, ఎన్నికల బరిలో ఉన్న రాష్ట్రంలోని పరిస్థితిని అర్థం చేసుకున్నారని పార్టీ నాయకుడు వెల్లడించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

Show comments