ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఈ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇవాళ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో ఉన్నతాధికారులపై కేంద్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉండేలా మోడీ సర్కార్ ఇటీవలనే ఓ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. ఇక, ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహ ధర్మాసనం విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
Read Also: Viral video: విమానంలో విండో సీటు కోసం దారుణంగా కొట్టుకున్న ప్రయాణికులు..
ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్దతను సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సవాల్ చేసింది. అంతేకాదు ఆర్డినెన్స్ ను క్యాన్సిల్ చేయడంతో పాటు మధ్యంతర స్టే విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీంతో ఢిల్లీలో పోలీస్, శాంతి భద్రతలు, భూమి మినహా సేవల నియంత్రణను ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన వారం రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది.. దీనిపై కేజ్రీవాల్ పలు రాష్ట్రాలకు చెందిన పార్టీలతో కలిసి పోరాటం చేశాడు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆప్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. ఈ ఆర్డినెన్స్ ను ఇప్పటికైనా రద్దు చేయాలని సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును కోరాడు.
Read Also: Viraj Ashwin: మా సినిమాకు చాలా మంది హీరోలు ఉన్నారు!