NTV Telugu Site icon

AAP: ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆప్‌ ర్యాలీ.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

Delhi

Delhi

ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు.. పోస్టింగ్ లపై పట్టుకోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం ముమ్మరం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యకతిరేకంగా దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహిస్తుంది. ఈ నిరసన కార్యక్రమానికి సుమారు లక్ష మంది హాజరు అయ్యారని ఆప్ పార్టీ పేర్కొంది.

Read Also: Reliance Jio Offer: జియోలో మరో కొత్త ప్రీఫెయిడ్ ప్లాన్స్..మ్యూజిక్ తోపాటు మరికొన్ని..

ఆప్ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ తో పాటు పార్టీ నాయకులు పెద్దసంఖ్యలో హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రామ్‌లీలా మైదాన్‌ చుట్టూ భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమం కొనసాగుతున్నంత సేపు వాహనాల రాకపోకలను నియంత్రించాలని ట్రాఫిక్‌ పోలీసులను కోరారు. అదేవిధంగా అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులను సభా వేదిక వద్దకు తరలించారు.

Read Also: Amazon Jungle: పిల్లలు దొరికారు కానీ.. వారిని వెతికిన కుక్క అమెజాన్ అడవుల్లో కనిపించకుండా పోయింది

రామ్‌లీలా మైదానం ప్రవేశ ద్వారాల వద్ద మెటల్‌ డిటెక్టర్లు, ఆ ప్రాంతం చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేశారు.
హస్తినలో పాలనాధికారం మొత్తం ప్రజాప్రభుత్వానిదేనని సుంప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీనికి వ్యతిరేకంగా అధికారుల బ‌దిలీలు, పోస్టింగ్‌ల కోసం కేంద్రం నేష‌న‌ల్ క్యాపిట‌ల్ సివిల్ స‌ర్వీస్ అథారిటీ ఏర్పాటు దిశ‌గా కేంద్ర ప్రభుత్వం మే 19న ఆర్డినెన్స్ ను తెచ్చింది. అయితే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీయేత‌ర పార్టీల మ‌ద్దతును కోరింది.

Read Also: Ap Schools: ఏపీలో రేపట్నుంచి స్కూళ్లు పునః ప్రారంభం.. అప్పటి వరకు ఒంటిపూటే..!

ఇది విప‌క్షాల‌కు అగ్నిప‌రీక్ష స‌మ‌య‌మ‌ని దేశ ప్రజాస్వామ్యం.. రాజ్యాంగాన్ని కాపాడాల‌నుకునే పార్టీలు ముందుకు రావాల‌ని ఆప్ పిలుపునిచ్చింది. రాజ్యసభలో ఆర్డినెన్సును అడ్డుకోవడానికి కేజ్రీవాల్ విపక్షాలను కూడగడుతున్నాడు. ఇందులో భాగంగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ప్రతిపక్ష పార్టీల అధినేతలను కలిసి వారి మద్దతు కోరుతున్నాడు.

Show comments