NTV Telugu Site icon

Kidnap : మా అభ్యర్థిని కిడ్నాప్ చేశారు.. అరవింద్ కేజ్రీవాల్

Aap Candidate

Aap Candidate

Kidnap : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ లో రాజకీయాలు రసవత్తరంగా రోజుకో విధంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సూరత్ (తూర్పు) నియోజవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కంచల్ జరీవాల్ కనిపించకుండా పోయారని ట్వీట్ చేశారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని కంచల్ జరీవాల్ పై ఒత్తిడి చేశారని, ఇప్పుడు కనిపించకుండా పోయారని కేజ్రీవాల్ అందులో రాసుకొచ్చారు. కేజ్రీవాల్ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషయంలోకి వెళితే.. ‘సూరత్ (తూర్పు) నియోజవర్గ మా అభ్యర్థి కంచన్ జరివాలా, నిన్న సాయంత్రం నుంచి కనిపించకపోవడం, ఈ రోజు అనూహ్యంగా అతను నామినేషన్ ఉపసంహరించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంలో అధికార బీజేపీ నేతలే తమ అభ్యర్ధిని కిడ్నాప్ చేసి బలవంతంగా నామినేషన్ ఉప సంహరించేలా చేశారంటూ ఆప్ ఆరోపిస్తుంది. బీజేపీనే ఆయనను కిడ్నాప్ చేసి ఉంటుందని ఆప్ నేతలు మండిపడ్డారు. అయితే కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే కంచన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఆప్, బీజేపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాగా బీజేపీ ఒత్తిడి వల్లే కంచన్ నామినేషన్ ఉపసంహరించుకున్నారనీ ఆప్ ఆరోపిస్తోంది. ఈ తరహా గుండాయిజం భారతదేశంలో ఎప్పుడూ చూడలేదని, ఇలాంటప్పుడు ఎన్నికల వల్ల ప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల 1, 3వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.

Show comments