Kidnap : మా అభ్యర్థిని కిడ్నాప్ చేశారు.. అరవింద్ కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ లో రాజకీయాలు రసవత్తరంగా రోజుకో విధంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సూరత్ (తూర్పు) నియోజవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కంచల్ జరీవాల్ కనిపించకుండా పోయారని ట్వీట్ చేశారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని కంచల్ జరీవాల్ పై ఒత్తిడి చేశారని, ఇప్పుడు కనిపించకుండా పోయారని కేజ్రీవాల్ అందులో రాసుకొచ్చారు. కేజ్రీవాల్ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Our candidate from Surat (East), Kanchan Jariwala, and his family missing since yesterday. First, BJP tried to get his nomination rejected. But his nomination was accepted. Later, he was being pressurised to withdraw his nomination.
Also Read
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
Has he been kidnapped?
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 16, 2022
విషయంలోకి వెళితే.. ‘సూరత్ (తూర్పు) నియోజవర్గ మా అభ్యర్థి కంచన్ జరివాలా, నిన్న సాయంత్రం నుంచి కనిపించకపోవడం, ఈ రోజు అనూహ్యంగా అతను నామినేషన్ ఉపసంహరించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంలో అధికార బీజేపీ నేతలే తమ అభ్యర్ధిని కిడ్నాప్ చేసి బలవంతంగా నామినేషన్ ఉప సంహరించేలా చేశారంటూ ఆప్ ఆరోపిస్తుంది. బీజేపీనే ఆయనను కిడ్నాప్ చేసి ఉంటుందని ఆప్ నేతలు మండిపడ్డారు. అయితే కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే కంచన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఆప్, బీజేపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాగా బీజేపీ ఒత్తిడి వల్లే కంచన్ నామినేషన్ ఉపసంహరించుకున్నారనీ ఆప్ ఆరోపిస్తోంది. ఈ తరహా గుండాయిజం భారతదేశంలో ఎప్పుడూ చూడలేదని, ఇలాంటప్పుడు ఎన్నికల వల్ల ప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల 1, 3వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.
#WATCH | Gujarat: AAP candidate from Surat (East) from Gujarat, Kanchan Jariwala, takes back his nomination after he was allegedly kidnapped last evening pic.twitter.com/E1vqqkveNi
— ANI (@ANI) November 16, 2022
తాజావార్తలు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!