NTV Telugu Site icon

AAP: హర్యానాలో ఆప్ హామీల వర్షం.. ఢిల్లీ-పంజాబ్ మాదిరిగా వ్యూహాలు..

Aap

Aap

హర్యానాలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ-పంజాబ్ లాగానే ఇప్పుడు హర్యానాలో కూడా అదే మోడల్‌ను తీసుకురావాలని ఆప్ ప్రయత్నిస్తోంది. శనివారం పంచకులలోని ఇంద్రధనుష్ ఆడిటోరియంలో ఆప్ ఐదు హామీలను ప్రకటించింది. ఈ కార్యక్రమానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, అరవింద్ కేజ్రివాల్ భార్య సునీతా కేజ్రీవాల్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ ఇప్పటికీ తీహార్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే.

READ MORE: Sonu Sood: ‘‘సొంత రామాయణం’’.. రోటీలపై ఉమ్మేస్తున్న వ్యక్తిని రాముడు-శబరితో పోల్చడంపై కంగనా ఫైర్..

ఢిల్లీ-పంజాబ్‌లో పార్టీ ప్రణాళిక విజయవంతం అయిన తర్వాత.. హర్యానాలో కూడా పార్టీ అదే తరహాలో మ్యానిఫెస్టోను ప్రకటించింది. హర్యానాలో అనేక సౌకర్యాలను ఉచితంగా అందజేస్తామని ఆప్ హామీ ఇచ్చింది. ఇందులో విద్యుత్, విద్య మరియు ఆరోగ్య సేవలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా.. రాష్ట్రంలోని మహిళలలకు ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో డబ్బు కూడా ఇవ్వనున్నట్లు ఆప్ ప్రకటించింది.

READ MORE: AP Rains: రాబోయే 2 రోజులు ఏపీలో వానలే వానలు..!

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 5 హామీలు ఇవే..

24 గంటల ఉచిత విద్యుత్
ఢిల్లీ, పంజాబ్‌ల మాదిరిగానే హర్యానాలో కూడా పార్టీ తన నమూనాను అమలు చేసింది. హర్యానా ప్రజల పాత బాకీ ఉన్న డొమెస్టిక్ బిల్లులన్నీ మాఫీ అవుతాయని హామీలో పేర్కొంది. విద్యుత్ కోతలు ఆగిపోతాయని, ఢిల్లీ, పంజాబ్‌ల మాదిరిగానే 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

2- అందరికీ నాణ్యమైన ఉచిత చికిత్స..
హర్యానాలోని ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్‌ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పునర్వైభవం, కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం చేపడతామని ప్రకటించింది.
అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా ప్రతి హర్యాన్వీకి పూర్తి చికిత్స ఉచితం.
అన్ని పరీక్షలు, మందులు, ఆపరేషన్లు మరియు చికిత్సలు ఉచితం అని హామీ ఇవ్వబడింది.

3- ఉచిత విద్య..
తాము అధికారంలోకి వస్తే.. ఢిల్లీ, పంజాబ్‌ల మాదిరిగానే హర్యానాలోనూ విద్యా మాఫియా అంతరించిపోతుందని ఆప్ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రయివేటు స్కూళ్లలో గూండాయిజాన్ని అరికడతామని, ప్రైవేట్ స్కూళ్లలో అక్రమంగా ఫీజులు పెంచడాన్ని అరికడతామని పార్టీ పేర్కొంది.

READ MORE: Microsoft Effect: ఒక్కరోజులో భారీగా తగ్గిన ఇండిగో షేర్లు..ఇన్ని కోట్ల నష్టమా..!

4- తల్లులు, సోదరీమణులందరికీ ప్రతి నెల రూ 1000.
తల్లులు, సోదరీమణులందరికీ ప్రతి నెల రూ.1,000 చొప్పున నగదు అందజేస్తామని ఆప్ హామీ ఇచ్చింది.

5- ప్రతి యువకుడికి ఉపాధి
కేవలం 2 సంవత్సరాలలో, పంజాబ్‌లో 45,000 ప్రభుత్వ ఉద్యోగాలు మరియు 3 లక్షల మందికి పైగా ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టిస్తామని ఆప్ తన మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఢిల్లీలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 12 లక్షల మందికి పైగా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపింది.