Aamir Khan: అర్జిత్ ఇంటికి.. ఆమిర్ ఖాన్ వెళ్లడానికి అసలు కారణం ఇదే..

Arjithsing,saipallavi

Arjithsing,saipallavi

ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ ఇటీవల ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమిర్ ఖాన్, పశ్చిమ బెంగాల్‌లోని అర్జిత్ సొంత ఇంటికి వెళ్లి నాలుగు రోజుల పాటు అక్కడే గడపడం సంచలనం సృష్టించింది. కేవలం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పడానికే ఆమిర్ వెళ్లారని అందరూ భావించారు. అయితే, ఆ పర్యటన వెనుక అసలు కారణం తన కుమారుడు జునైద్ ఖాన్ నటిస్తున్న ‘ఏక్ దిన్’ (Ek Din) సినిమా అని ఆమిర్ స్పష్టం చేశారు.

Also Read : Pawan Kalyan: ‘ఫౌజీ’ భామకు డబుల్ జాక్‌పాట్.. ఏకంగా పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ !

“అర్జిత్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేయడానికి నేను వెళ్లలేదు. కానీ నా సినిమా కోసం పాడమని కోరాను” అని ఆమిర్ ఖాన్ తెలిపారు. జునైద్ అంటే అర్జిత్‌కు ప్రత్యేకమైన ఇష్టం ఉండటంతో, ఆయన రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందే ఈ సినిమాకు సంతకం చేశారని, ఇచ్చిన మాట ప్రకారం జునైద్ కోసం ఐదు పాటలు పాడటానికి అర్జిత్ అంగీకరించారని ఆమిర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నాలుగు రోజుల ప్రయాణం చాలా ‘మ్యాజికల్’గా సాగిందని, అర్జిత్ కుటుంబంతో కలిసి గడపడం ఒక మధుర జ్ఞాపకమని ఆయన పేర్కొన్నారు. జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దిన్’ ద్వారా అర్జిత్ సింగ్ గొంతు మరోసారి వెండితెరపై మారుమోగనుంది. ప్లేబ్యాక్ సింగింగ్‌కు స్వస్తి పలికి క్లాసికల్ మ్యూజిక్ వైపు వెళ్లాలనుకుంటున్న అర్జిత్, తాను అంగీకరించిన పాత ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు.