Akash Chopra: ధోనీని దుర్భాషలాడిన CSK స్టార్ ప్లేయర్.. ఆ సమయంలో జరిగింది ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు టైటిల్ గెలుచుకున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఒక ఆసక్తికర ఘటనను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా బయటపెట్టారు. ఆ సీజన్లో సీఎస్కే జట్టుకు చెందిన ఒక ఆటగాడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని నేరుగా అవమానిస్తూ, దుర్భాషలాడాడని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వెల్లడించారు. ఈ సంఘటనతో జట్టులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, సదరు ఆటగాడిని వెంటనే జట్టు నుంచి తొలగించి ఇంటికి పంపేయాలని ధోని చుట్టూ ఉన్నవారు ఒత్తిడి తెచ్చారు.
అయితే, తన వ్యక్తిగత ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినప్పటికీ ధోని ఆవేశపడకుండా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశారని ఆకాశ్ చోప్రా వివరించారు. ఆ ఆటగాడు మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడని, తాను కెప్టెన్‌గా తన అహాన్ని (ఇగో) ప్రదర్శిస్తే అతడి బ్యాగులు సర్ది ఇంటికి పంపేయగలనని ధోని అన్నట్లు చోప్రా గుర్తుచేసుకున్నారు. కానీ ఆ ఆటగాడు జట్టుకు ఎంతో ఉపయోగపడతాడని, చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని భావించిన ధోని, తన కోపాన్ని , ఆత్మాభిమానాన్ని దిగమింగుకుని అతడిని జట్టులోనే కొనసాగించారని తెలిపారు. ధోని తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయం ఫలించి, ఆ ఆటగాడు జట్టు విజయాల్లో భాగమవ్వడమే కాకుండా సీఎస్కే 2023 ఛాంపియన్‌గా నిలవడానికి తోడ్పడ్డాడు.
Also Read
- Telangana Darshini: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ బంపర్ ఆఫర్..
- Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
- Bancroft: బాల్ ట్యాంపరింగ్ అందరికీ తెలుసు.. ఆస్ట్రేలియా బండారం బయటపెట్టిన బ్యాన్‌క్రాఫ్ట్..
- UP Elections 2027: యూపీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్న అఖిలేశ్? 24 సీట్లే ఆఫర్ చేసే ఛాన్స్
మరోవైపు.. ధోని తన ఐపీఎల్ ఆటగాడి ప్రయాణానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. 2025 మేలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ అతడికి చివరి మ్యాచ్ అయింది. 2026లో గాయాల కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ధోనీ ఆడలేకపోయారు. సీఎస్కే తరఫున మొత్తం 278 మ్యాచ్‌లలో 5,439 పరుగులు సాధించారు. ధోని సారథ్యంలో చెన్నై జట్టు ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలను గెలుచుకుంది. అలాగే భారత జట్టుకు మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిన ధోని, 2027 ఐపీఎల్ సీజన్ నుంచి సీఎస్కే జట్టుకు మెంటార్‌గా తన సేవలను అందించనున్నారు.
- Tags
- Aakash Chopra
- CSK
- IPL 2023
- ms dhoni
తాజావార్తలు
-
Akash Chopra: ధోనీని దుర్భాషలాడిన CSK స్టార్ ప్లేయర్.. ఆ సమయంలో జరిగింది ఇదే..
-
Telangana Darshini: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ బంపర్ ఆఫర్..
-
Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
-
Shivathmika Rajasekhar: నాకు సినిమాలంటే పిచ్చి.. “రేపు నా కల నిజమవుతోంది”!
-
Nayanthara : “నేను మదర్ థెరిసాను కాను” అయితే ఏంటి? నయనతార కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..