Aakasam Dhaati Vasthaava : మనసుకు హత్తుకునేలా వున్నా ఉన్నానో లేనో లిరికల్ సాంగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ కొత్త వారితో సినిమాలు చేస్తూ వుంటారు.ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూనే మరోవైపు చిన్న సినిమాలను కూడా ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వుంటారు.. ఇందులో భాగంగానే ఆయన నిర్మాణంలో రాబోతున్న మరో కొత్త చిత్రం ఆకాశం దాటి వస్తావా.ప్రముఖ డాన్స్ మాస్టర్ యష్‌ను హీరోగా పరిచయం చేస్తూ దిల్‌రాజు ప్రొడక్షన్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది.మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాకు శశి కుమార్ ముతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక మురళీధరన్ కథానాయికగా నటిస్తోంది. ర్యాంపీ నందిగాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఓ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ చిత్రం నుంచి ఉన్నానో లేనో లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ పాట ఎంతో కూల్‌గా మనసుకు హత్తుకునేలా ఉంది. కార్తిక్ అందించిన మ్యూజిక్ ట్యూన్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆయనే స్వయంగా ఈ పాటను ఆలపించడం జరిగింది.. ఆయన పాడిన విధానం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ సాంగ్ కు భరద్వాజ్ పాత్రుడు అద్భుతమైన లిరిక్స్ అందించారు.ఈ సాంగ్ లో యశ్-కార్తికా మురళిధరన్ మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఈ పాట వింటుంటే ప్రతి ఒక్కరీ ప్లే లిస్ట్ చార్ట్ లో కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ పాటలో అంత మంచి ఫీల్ వుంది.జీవితంలో ప్రేమ, సమయం మరియు డబ్బులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మూడింటిలో ఏది తగ్గినా కూడా ఆ బంధంలో గొడవలు జరుగుతాయి. ఆ నేపథ్యంతోనే సినిమాను మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిస్తున్నామని మూవీ టీమ్ చెబుతోంది.మరి ఈ సినిమా విడుదల అయినాక ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
తాజావార్తలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!