NTV Telugu Site icon

Aadi Srinivas : రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేసారు

Aadi Srinivas

Aadi Srinivas

రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న రేవంత్ పై సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేసారని, పెట్టబడులకు తెలంగాణను స్వర్గంగా మార్చుతున్నారన్నారు. రేవంత్ అమెరికా పర్యటన విజయవంతం కావడం బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని, సూటు బూటు వేసుకొని దావొస్ వెళ్లిన కేటీఆర్ ఎన్ని కంపెనీలను తెలంగాణకి తెచ్చారన్నారు ఆది శ్రీనివాస్‌. కేటీఆర్ ఏంవోయూ కుదుర్చుకున్న కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని, ఒప్పందం చేసుకున్న కంపెనీలకు గత ప్రభుత్వం సరైన వసతులు కల్పించలేదన్నారు ఆది శ్రీనివాస్‌. రేవంత్ సక్సెస్ తక్కువ చేసి చూపించేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కష్టపడుతోందని, బుర్రలేని వాళ్ళు కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు. అంగుళం భూమి కేటాయించకముందే మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.

Delhi: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 150 మంది మహిళా సర్పంచ్‌లు!..ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా?

తప్పులు చేసి తీహార్ జైల్లో ఎవరున్నారో ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ పదేండ్ల సూటు బూటు హడావిడికి రేవంత్ కేవలం 8 నెలల్లోనే సమాధానం చెప్పారని, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, మరోవైపు ప్రయివేట్ ఉద్యోగాల కల్పన చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు ఆది శ్రీనివాస్‌. తెలంగాణ అభివృద్దే మా ప్రభుత్వ లక్ష్యమని, మూడు సార్లు దావోస్ పోయి కంపెనీలు తెచ్చానన్న కేటీఆర్ దానిలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. విదేశీ పర్యటనల పేరుతో దుబాయి వెళ్లి సొంత బిల్డింగులు కొనుక్కున్న మీతో రేవంత్ కి పోలికా? అని ఆయన హెద్దేవ చేశారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి దిగజారవద్దని బీఆర్ఎస్ నేతలకు సూచిస్తున్నా అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే మా పని ఖతం అవుతుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారన్నారు ఆది శ్రీనివాస్‌.

Stock market: హిండెన్‌బర్గ్‌ నివేదిక ఎఫెక్ట్.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Show comments