Site icon NTV Telugu

Shanmukha Trailer: అసురుడిని ఎదిరించిన ధీరుడి కథ..‘షణ్ముక’ ట్రైలర్‌

Shanmukha

Shanmukha

టాలీవుడ్ యాక్షన్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలు తీసిన ఆది నటన పరంగా తండ్రి పేరు నిలబెట్టాడు. దీంతో తెలుగులో అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక తాజాగా ఆది ‘షణ్ముక’ అనే థ్రిల్లింగ్ కథతో రాబోతున్నాడు. అవికాగోర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్పని ద‌ర్శకత్వం వహిస్తుండగా.. సాప్పని బ్రదర్స్ స‌మ‌ర్పణ‌లో తుల‌సీరామ్ సాప్పని, ష‌ణ్ముగం సాప్పని, రమేష్‌ యాదవ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘షణ్ముక’ ఈ నెల 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.

READ MORE: Jalsa Shankar: చోరీలు చేయడంలో అతడి స్టైలే వేరప్ప.. బీఫార్మసీ పూర్తి చేసి 100పైగా చోరీలు

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. “సురులైన అసురులైన.. చేసిన తప్పులకు శిక్షలు అనుభవించకుండా తప్పించుకోలేరు. పూర్వం ఓ సురుడు తప్పు చేసి అసురు డయ్యాడు.. శాప విమోచనం కోసం తపించసాగాడు. అయితే ఇది అతడి కథ కాదు. ఒక అసురుడిని ఎదిరించిన ధీరుడి కథ..” అంటూ ట్రైలర్ మొదలవుతుంది. ‘షణ్ముక’ లో హీరో ఆది పోలీసులు పాత్రలో నటించాడు. హీరోయిన్ అవికాగోర్ ఓ మిస్టరీపై ఇన్‌వెస్ట్‌గేషన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అమ్మాయిలు కనిపించక పోవడం, వారు పోయిన నెలలోపే ప్రేమించిన అబ్బాయిలు ఆత్మహత్య చేసుకోవడంపై సారా(అవికాగోర్) దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తే.. ఈ సినిమా థ్రిల్లింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. మీరు కూడా ఓసారి చూసేయండి..

Exit mobile version