Aadi Saikumar: హీరో ఆది సాయికుమార్ నటించిన కొత్త సినిమా ” శంబాల” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. మూవీ సక్సెస్ నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్‌ను ప్రొడ్యూసర్ రాజేష్ దండా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాజేష్ దండా మాట్లాడుతూ.. హాస్య మూవీస్‌లో ఆది సాయికుమార్ నెక్ట్స్ మూవీ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
READ ALSO: Honour Killing: తెలంగాణలో పరువు హత్య.. పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని కూతురుని చంపిన పేరెంట్స్..
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాజేష్ దండా, హీరో ఆది సాయికుమార్‌తో మీడియాతో మాట్లాడుతూ.. హాస్య మూవీస్ బ్యానర్‌లో ఆది సాయికుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉందని అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీటెయిల్స్ త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని దక్కించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం “కె ర్యాంప్” మూవీని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించారు. అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఈ సంస్థలో నిర్మాణవుతున్నాయి. ఇదే టైంలో ఆది సాయికుమార్ తర్వాత సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై నిర్మించబోతున్నట్లు రాజేష్ దండా వెల్లడించారు.
