సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు, టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు రెట్టింపు సంతోషంలో మునిగిపోతున్నారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆదికి, ఇటీవల విడుదలైన ‘శంబాల’ చిత్రం మంచి విజయాన్ని అందించి ఊరటనిచ్చింది. ఈ సక్సెస్ జోష్‌లో ఉండగానే, ఆయన వ్యక్తిగత జీవితంలో మరో తీపి కబురు అందింది. ఆది భార్య అరుణ శుక్రవారం (జనవరి 2) ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సాయి కుమార్ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.
Also Read : Haindava : అదిరిపోయిన ‘హైందవ’ ఫస్ట్ లుక్..
ఈ విషయాన్ని ఆది సాయి కుమార్ శనివారం సోషల్ మీడియా వేదికగా చాలా క్యూట్‌గా పంచుకున్నారు. తన బాబు చిన్నారి చేతి వేళ్లను చూపిస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ‘మా రెండో బిడ్డకు సాదర స్వాగతం.. ఈసారి బాబు పుట్టాడు’ అంటూ పోస్ట్ చేశారు. 2014లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరుణను వివాహం చేసుకున్న ఆదికి ఇప్పటికే అయాన అనే కూతురు ఉంది. ఇప్పుడు వారసుడి రాకతో అటు కెరీర్ పరంగా, ఇటు పర్సనల్ లైఫ్ పరంగా ‘డబుల్ డిలైట్’ అందుకున్న ఆది కి సినీ ప్రముఖులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
