Site icon NTV Telugu

డిసెంబర్ 30న ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’

Top Gear Movie

Top Gear Movie

లవ్లీ హీరో ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ అంటూ తన కెరీర్‌కు టాప్ గేర్ వేసేందుకు సిద్ధం అవతున్నారు. ‘తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెలో’ చిత్రాల తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ సినిమాతో ఆది సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఆదిత్య మూవీస్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రాబోతోంది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3D మోషన్ పోస్టర్, దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందంటున్నారు నిర్మాతలు.

Also Read : HIT2 Song Promo: హిట్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో.. లిప్ లాక్ తో రెచ్చిపోయిన అడవి శేష్
ఆదికి జంటగా రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్టు మేకర్లు ప్రకటించారు. షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుతున్నామని తెలిపారు. త్వరలో ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేస్తామంటున్నారు. K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా, గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా కాగా హర్ష వర్ధన్ రామేశ్వర్ సర్వాలు సమకూర్చారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ ఇతర ముఖ్య పాత్రధారులు పోషించారు.

Exit mobile version