Aadhaar updated Free: ఆధార్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్)… ఆధార్‌లోని డెమొగ్రాఫిక్ అంటే పుట్టినతేదీ, చిరునామా, పేరులో మార్పులు లాంటివి ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కలిపించింది.. వీటికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.. అయితే, అవి ఇప్పటికే ఉచితంగా పొందే అవకాశం ఉండదు.. ఎందుకంటే.. జూన్ 14 వరకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది.. ఈ లోగా ఆన్‌లైన్‌లో నేరుగా మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉండగా.. జూన్ 14వ తేదీ తర్వాత వాటికి సంబంధించిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
Read Also: MLA RK: విదేశాల్లో ఉన్నందుకే నాపై దుష్ప్రచారం.. రాజకీయాల్లో ఉంటే జగన్ తోనే..!
ఆధార్‌లో మార్పులు ఎలా చేసుకోవాలి అనే విషయానికి వెళ్తే.. మైఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఈ సేవలు ఉచితం.. కానీ, ఆధార్ సేవా కేంద్రాల ద్వారా అప్‌డేట్, డెమొగ్రాఫిక్ మార్పులు చేయిస్తే మాత్రం 50 రూపాయాలు చెల్లించాల్సి వుంటుంది. అయితే, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరులకు ప్రయోజనం చేకూరనుంది.. ఈ ఉచిత సేవలో.. పేరులో అక్షర దోషాలు, పుట్టిన తేదీ, అడ్రాస్ మార్పులు, లింగం, పదేళ్లుగా ఆధార్ అప్‌డేట్ చేసుకోనివారు కూడా ఈ ఉచిత సౌకర్యాన్ని పొందవచ్చు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉడాయ్ పేర్కొంది.. అయితే, ఏ మార్పులు చేసినా ఇందుకోసం నిర్దేశిత జాబితాలోని వోటర్, పాన్‌కార్డ్, పాస్‌పోర్ట్, టెన్త్ మెమో.. మొదలైనవి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కాగా, పదేళ్ల క్రితం ఆధార్ పొందినవారు, ఆ తర్వాత అప్‌డేట్ చేసుకోనట్టయితే.. ఇప్పుడు అప్‌డేట్ తప్పనిసరైన విషయం విదితమే.. అయితే, ఉడాయ్ ఇచ్చిన ఈ అవకాశం కొన్ని కోట్ల మందికి ఉపయోగం కానుంది.