NTV Telugu Site icon

Fake Certificates: పెళ్లికి ఒప్పుకోని యువతి.. నకిలీ వివాహ ధృవీకరణ పత్రాలతో వేధింపులు..!

Fake Certifiates

Fake Certifiates

Fake Certificates: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాల్వాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళను వెంటపడి వేధిస్తున్నాడు ఓ యువకుడు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాలని ఇబ్బందికి గురి చేస్తున్నాడు. దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో.. యువతితో పెళ్లి అయినట్లు సర్టిఫికేట్ తయారు చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేసారు. అంతేకాకుండా అతనికి సహకరించిన మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Pesticides: తల్లి పాల ద్వారా పిల్లలకు చేరుతున్న పురుగుమందులు.. మాంసం తింటే రిస్క్ ఎక్కువట!

నకిలీ పత్రాల ద్వారా వివాహ ధృవీకరణ పత్రాన్ని తయారు చేసి తన పరువు తీశారని గ్రామానికి చెందిన బాలిక ఆరోపించింది. ముఖ్యంగా బోనఫైడ్ సర్టిఫికెట్, నా అనుమతి లేకుండా స్కూల్‌లో ఉన్న ఫోటో తీసుకొని వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చేయించాడని తెలిపింది. అంతకుముందు ఆ యువకుడు తనను బెదిరించాడని.. నన్ను పెళ్లి చేసుకో.. లేకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని ప్రాణాలతో విడిచిపెట్టబోనని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఇదే విషమయై గ్రామంలో పంచాయతీ ఏర్పాటు చేయగా.. ఊరి పెద్దలు అతనికే సహకరించినట్లు పోలీసులకు తెలిపింది. మానసికంగా తనను వేధిస్తున్నాడని.. అతని పట్ల ప్రాణభయం ఉందని పోలీసులకు చెప్పగా.. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read Also: Hero Vijay: రాజకీయాలపై హీరో విజయ్ సెటైర్లు.. డబ్బు తీసుకుని ఓటేస్తే..

పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ పై బయటికొచ్చిన నిందితుడు తౌసిఫ్ షేక్లా.. మళ్లీ అలానే ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అతను మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని.. కాలేజీకి వెళ్లడం కష్టంగా ఉందని బాధితురాలు తెలిపింది. నిందితుడు తౌసిఫ్ షేక్ ఒక నేరస్థుడని.. ఒక హత్య కేసులో అతను జైలుకు కూడా వెళ్ళినట్లు బాలిక తెలిపింది. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇవే కాక మరో కారణం.. కాలేజీలో తనకు పెళ్లయిందనే వార్త ప్రచారంలోకి వచ్చి పరువు పోయిందని పేర్కొంది.