NTV Telugu Site icon

Instagram Reels: గన్ చేతిలో పట్టుకుని హైవేపై స్టెప్పులేసిన యువతి.. తరువాత ఏమైందంటే..?

Insta

Insta

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ కటకటాల పాలవుతున్నారు. ఇప్పుడు అంతా ఇన్‌స్టా రీల్స్ రోజులు. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అందులో పోస్టు చేయడం కామన్ గా మారింది. పాపుల‌ర్ అయ్యేందుకు సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదికైంది. దీంతో చాలా మంది ర‌క‌ర‌కాల వీడియోల‌తో అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌కు ప్రత్యేక ప్లేసే ఉంది. ఓ అమ్మాయి చెందిన ఇన్ స్టా రీల్ ప్రస్తుతం వైరల్ గా మారింది. సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఇంతకు ఏమైందంటే..

READ MORE: Yahya Sinwar: ఇజ్రాయెల్‌ మోస్ట్‌ వాంటెడ్ యాహ్యా సిన్వార్ రఫాలో లేడు.. సొరంగాల్లో దాక్కున్నాడు!

అయితే ఇటీవ‌ల ల‌క్నో హైవేపై ఓ అమ్మాయి త‌న చేతిలో పిస్తోల్‌తో ఆ రీల్స్ కోసం డ్యాన్స్ చేసింది. పాపుల‌ర్ యూట్యూబ‌ర్ సిమ్రన్ యాద‌వ్ .. చట్ట విరుద్ధంగా గన్ ను బయటకు తీసి ల‌క్నో హైవేపై ఓ భోజ్‌పురి పాట‌కు స్టెప్పులేసింది. ఇన్‌ఫ్లుయెన్సర్ డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోను చూసిన ఓ అడ్వకేట్ ఆగ్రహించారు. ఆ వీడియోను త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ అమ్మాయిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు పోలీసులు వెల్లడించారు. వీడియో ప‌ట్ల సోష‌ల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంద‌రు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తున్నారు.