Site icon NTV Telugu

Nose Typing: ముక్కుతో టైపింగ్ చేసి రికార్డు సృష్టించిన యువకుడు

Nose Typing

Nose Typing

అంగ వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఏ పని చేయకుండా ఖాళీగా ఉండిపోలేదు ఓ యువకుడు. సవాళ్లను అధిగమించి తనలోని సత్తా చాటాలని అనుకున్నాడు. ఆ సంకల్ప బలంతోనే రికార్డు సృష్టించాడు. గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన స్మిత్ చాంగెలా చిన్నప్పటి నుంచి న్యూరోపతితో బాధపడుతున్నాడు. అయితే, ముక్కుతో ఫోన్ లో టైప్​ చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అనుకున్నది సాధించాలనే తపన ఉంటే వైకల్యం ఎన్నటికీ అడ్డురాదని స్మిత్ నిరూపించాడు.

Read Also: Baby : కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్న మేకర్స్..?

రాజ్ కోట్ లో లో నివాసం ఉంటున్న స్మిత్​ చాంగెలా.. చిన్నప్పటి నుంచి నరాలకు వచ్చే వ్యాధితో సఫర్ అవుతున్నాడు. అందువల్ల అతడు మొబైల్ ఫోన్ ను చేత్తో టైప్​ చేస్తుంటే నొప్పులు ఎక్కువగా వచ్చేవి.. దీంతో లాక్ డౌన్ టైంలో​అతడు.. ముక్కుతో ఫోన్​లో టైపింగ్​ చేశాడు. మొదట్లో స్మిత్ కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ఇప్పుడు వేగంగా టైపింగ్​ చేస్తున్నాడు.

Read Also: TFCC Elections: సంతోషపడాలో, సిగ్గుపడాలో తెలియట్లేదు.. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై తమ్మారెడ్డి ఫైర్

అయితే, ఇటీవలే ఇండియా బుక్​ ఆఫ్​ రికార్టులో స్థానం దక్కించుకున్నట్లు స్మిత్ చాంగెలా చెప్పుకొచ్చాడు. ఒక్క నిమిషంలో 151 అక్షరాలు/ 36 పదాలు టైప్​ చేశానని అతడు వెల్లడించాడు. ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​ నుంచి గుర్తింపు పత్రం కూడా తీసుకున్నట్లు పేర్కొన్నాడు. నాలాంటి దివ్యాంగ యువకులు దేశంలో ఎంత మందో ఉన్నారు.. వారు కూడా జీవితంలో ఎక్కడో ఒక చోట ఒత్తిడికి లోనవుతారు.. అప్పుడు వారేం పనిచేయలేక బాధపడుతుంటారు.. అలా కాకుండా ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలి అని స్మిత్ తెలిపాడు. వారు కూడా వినూత్నంగా ఆలోచించి విజయం సాధించాలి అంటూ స్మిత్​ చాంగెలా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బీకాం చదువుతూ.. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతూ.. ఎందరో యువకులకు స్మిత్ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Exit mobile version