Site icon NTV Telugu

Agra: మద్యం మత్తులో వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం..

Agra

Agra

సమాజంలో రోజు రోజుకు హత్యలు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. రోజుకు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధులు మాత్రం వారి బుద్ధిని ఆపడం లేదు. చిన్న, పెద్దా… ముసలి, ముతక అని తేడా లేకుండా, కామవాంఛ తీర్చుకునేందుకు దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా.. యూపీలోని ఆగ్రాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది.

Read Also: Teacher Murder: ఆదిలాబాద్ టీచర్ హత్యకేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!

నామ్నేర్ కూడలి వద్ద రోడ్డు పక్కన నిద్రిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలి దగ్గరికి వచ్చిన ముగ్గురు యువకులు.. మద్యం మత్తులో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. వృద్ధురాలు వద్దని ఎంతా మొరాయిస్తున్న ఆ కామంధుడు వినలేదు. అయితే.. సమీపంలోని ఓ దుకాణంలో నిద్రిస్తున్న యువకుడు కేకలు విని లేచాడు. ఈ ఘటనకు పాల్పడుతున్న నిందితుల వీడియో తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నామ్‌నేర్‌ కూడలిలోని కంట్రీ లిక్కర్‌ ఎదురుగా గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇక్కడ డ్రెయిన్‌పై నిర్మించిన కల్వర్టు ఒడ్డున 80 ఏళ్ల వృద్ధురాలు నిద్రిస్తున్నాడు. అర్థరాత్రి ముగ్గురు యువకులు మద్యం మత్తులో అక్కడికి వచ్చారు. వృద్ధురాలి పక్కనే కూర్చొని లేపేందుకు ప్రయత్నించారు.

Read Also: IAS Officers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

అయితే.. ఆ వృద్ధురాలు ఎంత లేపినా లేవకపోవడంతో ఓ యువకుడు వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా యువకుడు మాత్రం ఆగలేదు. ఎదురుగా ఉన్న దుకాణంలో నిద్రిస్తున్న యువకుడు కేకలు విని లేచాడు. మూసిఉన్న దుకాణం లోపల నుండి ఈ ఘటనకు సంబంధించి మొత్తం వీడియో తీశాడు. కాగా.. ఈ ఘటన వీడియోను పరిశీలించిన నగర డీసీపీ సూరజ్ రాయ్ నిందితుడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. వీడియో ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Exit mobile version