నిండు నూరేళ్లు జీవించాల్సిన మనుషులు.. ఆవేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. జాబ్ రాలేదని కొందరు, డబ్బులు లేవని కొందరు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని కొందరు.. ఇలా రకరకాల కారణాలతో తమ జీవితాన్ని బలి ఇస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే.. జీవితంలో పోరాడి సాధించాలి కానీ, ఇలా పిరికితనంగా, మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకోవడం మంచిదికాదు. చనిపోయిన వారు బాగానే ఉంటారు. కానీ వారి తల్లిదండ్రులు పడే రోధన చాలా ఘోరంగా ఉంటుంది. తాజాగా.. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని మీర్పేట్లో చోటు చేసుకుంది.
ఓ యువకుడు వివాహం కావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి ఇంట్లో తండ్రితో గొడవపడి జిల్లెలగూడ సందన చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు యువకుడు. మృతుడు నాగరాజు (28) చంపాపేట్ నివాసిగా గుర్తించారు. యువకుడు న్యాయవాది దగ్గర పని చేసేవాడని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.
