NTV Telugu Site icon

Drugs: చిన్న బ్యాగ్లో రూ.30 లక్షల డ్రగ్స్.. సరఫరా చేస్తున్న మహిళ అరెస్ట్

Drugs

Drugs

రైలు ప్రయాణం చేసేటప్పుడు తమతో పాటు తమ లగేజీలను బ్యాగ్ లలో తీసుకువెళతారు. అయితే.. అందులో ఏముంటుందన్న విషయం పక్కన కూర్చే వారికి తెలియదు. కానీ.. స్మగ్లర్లు రైలు ప్రయాణం ద్వారానే.. కోట్లాది విలువ చేసే డ్రగ్స్ ను రాష్ట్రాలు దాటిస్తున్నారు. సమాచారం అందితే దొరికేవి కొన్నైతే.. దొరకనివి చాలా ఉన్నాయి. తరుచూ మనం చూస్తూనే ఉంటాం.. రైళ్లలో డ్రగ్స్ తరలిస్తున్నారని.. పట్టుబడ్డారన్న వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

అయితే.. లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ డ్రగ్స్ సరఫరా చేస్తోంది. చూడటానికి ప్రయాణికురాలిగా ఉన్నప్పటికీ.. అనుమానం వచ్చి చూస్తే, ఆమె వద్ద నుంచి 30 లక్షల రూపాయల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. అనంతరం ఎస్టీఎఫ్ (STF) బృందం ఆమెను అరెస్టు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. వాస్తవానికి చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లోని మూడో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై చీర కట్టుకున్న మహిళ బ్యాగ్‌తో నిలబడి ఉంది. అయితే.. అక్కడే ఉన్న పోలీసులకు అనుమానం వచ్చి బ్యాగ్‌ని తెరిచి చెక్ చేయగా.. అందులో రూ.30 లక్షల విలువైన నల్లమందు కనిపించింది. దీంతో వెంటనే ఆ మహిళను అరెస్ట్ చేశారు.

Swamti Maliwal: కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ వెయిట్ చేస్తుండగా జరిగిందిదే..!

అరెస్టయిన మహిళ జార్ఖండ్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. అయితే.. బరేలీకి నల్లమందును డెలివరీ చేసేందుకు వెళుతున్నట్లు విచారణలో తేలింది. కాగా.. నల్లమందును ఒక్కసారి డెలివరీ చేస్తే తనకు రూ.10వేలు వచ్చేదని చెబుతుంది. డిప్యూటీ ఎస్పీ విమల్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా స్మగ్లర్ ప్రమీల జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా బర్కాకన్నలోని పట్రాటు నివాసి. ఆమె రెండు కిలోలు నల్లమందును స్వాధీనం చేసుకున్నామని.. అంతర్జాతీయ మార్కెట్‌లో దాని ధర దాదాపు రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు. మరోవైపు.. ఆమె వద్ద నుంచి మొబైల్ ఫోన్, రూ.2830 స్వాధీనం చేసుకున్నారు.

కాగా.. పోలీసులు ఆమెను విచారించగా ముఠా నాయకుడు జార్ఖండ్ నివాసి ఓంవీర్ అని ప్రమీల చెప్పింది. అతను ప్రస్తుతం బరేలీలో నివసిస్తున్నాడని.. వివిధ వ్యక్తుల వద్ద నుంచి నల్లమందు కొనుగోలు చేస్తాడని తెలిపింది. ఈ క్రమంలో.. ముఠా నాయకుడు, ఇతర వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు డిప్యూటీ ఎస్పీ తెలిపారు. మరోవైపు.. ఎన్‌సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) బృందం కూడా ప్రమీలను విచారించనుంది.