ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మంచు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో బయటకు వెళ్లాలంటే చాలా కష్టం. అయితే.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎల్విరా లండ్‌గ్రెన్ చలితో వణుకుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎల్విరా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. కాగా.. ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో మీరు ఎల్విరా చుట్టూ మంచు పర్వతం ఉన్నట్లు చూడవచ్చు. ఎల్విరా తన తడి జుట్టును వెనక్కి నెట్టడానికి ప్రయత్నించగా.. అది నిటారుగా లేచి ఉంటుంది. జుట్టును సరిచేయడానికి పదే పదే ప్రయత్నించినప్పటికీ.. జుట్టు చెక్కగా మారి గడ్డకట్టింది.
Read Also: Pak Terrorist: ముంబై దాడి కుట్రదారు, లష్కరే కీలక ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవి మృతి
ఈ వీడియో Instagramలో @exploring.humanలో షేర్ చేశారు. అంతేకాకుండా క్యాప్షన్‌లో.. ఉష్ణోగ్రత -30°Cకి చేరుకుంది. నేను ఒక చిన్న ప్రయోగం చేయాల్సి వచ్చింది. ఈ వీడియో ఉత్తర స్వీడన్‌కు చెందినది. ఈ వీడియోకు ముందు కూడా.. చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అని రాసుకొచ్చింది.
Read Also: Jogi Ramesh: పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా నేను సిద్ధం..
కాగా.. స్వీడన్‌లో బుధవారం ఉష్ణోగ్రత -43 డిగ్రీల వద్ద నమోదైంది. 1999 తర్వాత తొలిసారిగా స్వీడన్‌లో జనవరిలో ఇంతటి ఉష్ణోగ్రత నమోదైంది. ఎల్విరా పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా లైక్ చేసారు. అంతేకాకుండా.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
