NTV Telugu Site icon

AP Crime: దారుణం.. రెండు రోజుల పాటు ఇంట్లో నిర్బంధించి మహిళపై అత్యాచారం

Friends Rape

Friends Rape

AP Crime: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కీచకులు చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెడనలో దారుణం జరిగింది. ఓ మహిళను ఇంట్లో నిర్బంధించి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుర్మార్గులు.

Read Also: Rash Car Driving: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను ఢీకొట్టిన మైనర్ బాలుడు..

అసలేం జరిగిందంటే.. కృష్ణా జిల్లా పెడనలో అద్దె ఇంట్లో నివసిస్తున్న కారే తేజశ్రీ (32 )మచిలీపట్నంలో జీవీకే రోల్డ్ గోల్డ్ కవరింగ్ పని చేస్తూ ఉంటుంది. పని నిమిత్తం రోజు మచిలీపట్నం వెళ్లి వచ్చే సందర్భాల్లో ఆటో డ్రైవర్ తోకల వినోద్ కుమార్ (25), అతని స్నేహితుడు దోమపాటి లక్ష్మణరావు (49) పరిచయమయ్యారు. ఈ క్రమంలో వారిద్దరు ఆమెతో స్నేహంగా ఉన్నట్లు నటించి.. ఓ పథకం రచించారు. ఆగస్టు 3న సాయంత్రం 7 గంటల సమయంలో పని ముగించుకుని యధావిధిగా వినోద్ కుమార్ ఆటో ఎక్కింది ఆ మహిళ. పథకం ప్రకారం ముందుగానే లక్ష్మణరావు ఆటోలో ఉన్నాడు. ఆమెను లక్ష్మణరావు గట్టిగా పట్టుకోగా.. ఆటోడ్రైవర్‌ వినోద్‌ కుమార్‌ ఆటోను శెరువత్తర్లపల్లిలోని తన ఇంటికి తీసుకువెళ్లారు.

మహిళను ఇంట్లో బంధించి బీరు తాగించి అతని స్నేహితుడితోపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజులు పాటు ఇంట్లోనే బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. 5వ తేదీన అక్కడి నుంచి తప్పించుకుని పెడన చేరుకున్న మహిళ.. తల్లిదండ్రులతో ఈ విషయ చెప్పడంతో పెడన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Show comments