AP Crime: దారుణం.. రెండు రోజుల పాటు ఇంట్లో నిర్బంధించి మహిళపై అత్యాచారం
- మహిళను ఇంట్లో నిర్బంధించి రెండు రోజుల పాటు అత్యాచారం
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కీచకులు చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెడనలో దారుణం జరిగింది. ఓ మహిళను ఇంట్లో నిర్బంధించి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుర్మార్గులు.
Read Also: Rash Car Driving: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను ఢీకొట్టిన మైనర్ బాలుడు..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
అసలేం జరిగిందంటే.. కృష్ణా జిల్లా పెడనలో అద్దె ఇంట్లో నివసిస్తున్న కారే తేజశ్రీ (32 )మచిలీపట్నంలో జీవీకే రోల్డ్ గోల్డ్ కవరింగ్ పని చేస్తూ ఉంటుంది. పని నిమిత్తం రోజు మచిలీపట్నం వెళ్లి వచ్చే సందర్భాల్లో ఆటో డ్రైవర్ తోకల వినోద్ కుమార్ (25), అతని స్నేహితుడు దోమపాటి లక్ష్మణరావు (49) పరిచయమయ్యారు. ఈ క్రమంలో వారిద్దరు ఆమెతో స్నేహంగా ఉన్నట్లు నటించి.. ఓ పథకం రచించారు. ఆగస్టు 3న సాయంత్రం 7 గంటల సమయంలో పని ముగించుకుని యధావిధిగా వినోద్ కుమార్ ఆటో ఎక్కింది ఆ మహిళ. పథకం ప్రకారం ముందుగానే లక్ష్మణరావు ఆటోలో ఉన్నాడు. ఆమెను లక్ష్మణరావు గట్టిగా పట్టుకోగా.. ఆటోడ్రైవర్ వినోద్ కుమార్ ఆటోను శెరువత్తర్లపల్లిలోని తన ఇంటికి తీసుకువెళ్లారు.
మహిళను ఇంట్లో బంధించి బీరు తాగించి అతని స్నేహితుడితోపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజులు పాటు ఇంట్లోనే బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. 5వ తేదీన అక్కడి నుంచి తప్పించుకుని పెడన చేరుకున్న మహిళ.. తల్లిదండ్రులతో ఈ విషయ చెప్పడంతో పెడన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు
తాజావార్తలు
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?