Uttar Pradesh: మంత్రాల అనుమానంతో మహిళపై దాడి.. నోట్లో మూత్రం పోసి..!
- మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో ఓ మహిళపై దాడి
- ఉత్తర ప్రదేశ్‌లోని సూరజ్‌పూర్ ఖేడీ గ్రామంలో ఘటన
- తమ కూతురుకు చేతబడి చేస్తుందని అనుమానం మహిళను తీవ్రంగా కొట్టి.. జుట్టు కత్తిరించి.. నోట్లో మూత్రం పోసిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో ఓ మహిళపై క్రూరత్వం చూపించారు. కనికరం లేకుండా.. దాడి చేశారు. ఈ ఉదంతం ఉత్తర ప్రదేశ్‌లోని సూరజ్‌పూర్ ఖేడీ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే.. తమ కూతురు అనారోగ్యానికి కారణం ఆ మహిళేనని.. తాను చేతబడి చేస్తుందని అనుమానించారు. దీంతో.. బాలిక కుటుంబీకులు ఆ మహిళను తీవ్రంగా కొట్టారు. అంతే కాకుండా జుట్టు కూడా కత్తిరించారు.
అయితే.. అంతటితో ఆగకుండా, తనతో బలవంతంగా మూత్రం తాగించారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా.. బాధితురాలి కుటుంబం బీహార్‌లోని పూర్నియాలో ఉంటుండగా.. ఈ మహిళ మాత్రం ఆ గ్రామంలో ఇళ్లు అద్దెకు తీసుకుని జీవిస్తుంది.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ఇదిలా ఉంటే.. బాధితురాలిపై దాడి చేసిన నిందితుడు ననువా ఓ కాంట్రాక్టర్.. ఇతను కూడా బీహార్ రాష్ట్రానికి చెందినవాడే. అయితే.. కాంట్రాక్టర్ కుమార్తె తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో.. ఆ మహిళపై అనుమానం వచ్చి.. తానే తన కూతురికి చేతబడి చేస్తుందని అనుమానించాడు. దీంతో.. కోపంతో బాధిత మహిళపై నిందితుడు మొదట దాడి చేసి, అనంతరం ఆమె జుట్టును కత్తిరించారు. అయితే.. ఈ క్రమంలో నిందితుడు తనను బలవంతంగా మూత్రం తాగించారని బాధితురాలు పేర్కొంది. అంతేకాకుండా.. తీవ్ర గాయాలైనట్లు చెప్పింది.
దాడికి సంబంధించి నిందితుడు తమ మొబైల్ ఫోన్లో ఓ వీడియో తీశాడు. కాగా.. ఈ వీడియో అతని దగ్గరి నుంచి సోషల్ మీడియాలో చేరింది. ఈ క్రమంలో.. బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. నిందితుడు ననువా కాంట్రాక్టర్, అతని భార్య పింకీ, మైనర్ కుమారుడు, కుమార్తెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!