NTV Telugu Site icon

Uttar Pradesh: మంత్రాల అనుమానంతో మహిళపై దాడి.. నోట్లో మూత్రం పోసి..!

Up

Up

మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో ఓ మహిళపై క్రూరత్వం చూపించారు. కనికరం లేకుండా.. దాడి చేశారు. ఈ ఉదంతం ఉత్తర ప్రదేశ్లోని సూరజ్‌పూర్ ఖేడీ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే.. తమ కూతురు అనారోగ్యానికి కారణం ఆ మహిళేనని.. తాను చేతబడి చేస్తుందని అనుమానించారు. దీంతో.. బాలిక కుటుంబీకులు ఆ మహిళను తీవ్రంగా కొట్టారు. అంతే కాకుండా జుట్టు కూడా కత్తిరించారు.

అయితే.. అంతటితో ఆగకుండా, తనతో బలవంతంగా మూత్రం తాగించారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా.. బాధితురాలి కుటుంబం బీహార్‌లోని పూర్నియాలో ఉంటుండగా.. ఈ మహిళ మాత్రం ఆ గ్రామంలో ఇళ్లు అద్దెకు తీసుకుని జీవిస్తుంది.

ఇదిలా ఉంటే.. బాధితురాలిపై దాడి చేసిన నిందితుడు ననువా ఓ కాంట్రాక్టర్.. ఇతను కూడా బీహార్ రాష్ట్రానికి చెందినవాడే. అయితే.. కాంట్రాక్టర్ కుమార్తె తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో.. ఆ మహిళపై అనుమానం వచ్చి.. తానే తన కూతురికి చేతబడి చేస్తుందని అనుమానించాడు. దీంతో.. కోపంతో బాధిత మహిళపై నిందితుడు మొదట దాడి చేసి, అనంతరం ఆమె జుట్టును కత్తిరించారు. అయితే.. ఈ క్రమంలో నిందితుడు తనను బలవంతంగా మూత్రం తాగించారని బాధితురాలు పేర్కొంది. అంతేకాకుండా.. తీవ్ర గాయాలైనట్లు చెప్పింది.

దాడికి సంబంధించి నిందితుడు తమ మొబైల్‌ ఫోన్లో ఓ వీడియో తీశాడు. కాగా.. ఈ వీడియో అతని దగ్గరి నుంచి సోషల్ మీడియాలో చేరింది. ఈ క్రమంలో.. బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. నిందితుడు ననువా కాంట్రాక్టర్, అతని భార్య పింకీ, మైనర్ కుమారుడు, కుమార్తెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.