Site icon NTV Telugu

Maintenance: ఇష్టానుసారం విడిగా నివసించే స్త్రీకి భర్త నుంచి భరణం అడిగే హక్కు లేదు..

Maintenance

Maintenance

Maintenance: ఒక మహిళ తన ఇష్టానుసారం విడివిడిగా జీవిస్తుంటే భర్త నుంచి భరణం పొందే హక్కు ఆమెకు లేదని మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లోని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు భర్త నుంచి విడివిడిగా ఉంటున్న మహిళ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. భర్త నుంచి విడిగా జీవించాలని మహిళ నిర్ణయించుకున్నందున ఆమెకు భరణం అడిగే హక్కు లేదని కోర్టు పేర్కొంది. కోర్టులో మహిళ దరఖాస్తును విచారించినప్పుడు, వారిద్దరూ డిసెంబర్ 15, 2020 నుండి విడిగా ఉన్నారని ఆమె భర్త చెప్పాడు. ఆ సమయంలో భార్యే విడిపోయిందని భర్త చెప్పాడు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 కింద పొందిన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భర్త కోర్టును ఆశ్రయించాడు.

భర్తపై భార్య కేసు పెట్టింది..
మరోవైపు భార్య కూడా అతనిపై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసింది. దీంతో పాటు ఒప్పందం ప్రకారం తన భర్త నుంచి వచ్చిన రూ.12 లక్షల చెక్కు కూడా బౌన్స్ అయిందని ఆ మహిళ కేసు పెట్టింది. ఈ విషయం కుటుంబ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి కేఎన్ సింగ్ ముందుకు వచ్చినప్పుడు, ఆమె వాంగ్మూలం ప్రకారంమహిళ పిటిషన్‌ను తిరస్కరించారు. తన భర్తతో కలిసి జీవించడం ఇష్టం లేదని మహిళ స్వయంగా చెప్పిందని, అలాంటప్పుడు ఆమెకు మెయింటెనెన్స్ అలవెన్స్ పొందే హక్కు ఎలా ఉంటుందని న్యాయమూర్తి కేఎన్ సింగ్ అన్నారు. దీంతో న్యాయమూర్తి మహిళ డిమాండ్‌ను అంగీకరించేందుకు నిరాకరించారు.

Read Also: Ashok Chavan Resigns: కాంగ్రెస్‌ను వీడిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్

అహ్మదాబాద్‌లో విడాకుల నిర్ణయం తోసిపుచ్చిన కోర్టు..
మరోవైపు, హిందువులలో వివాహం చాలా పవిత్రమైనదని, ఇతర మతాలలో లాగా రాజీ లేదని అహ్మదాబాద్‌లోని సెషన్స్ కోర్టు హిందూ జంట విడాకులను తిరస్కరించింది. ఈ సూచనతో ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సెషన్స్ కోర్టు తిరస్కరించింది. విడాకుల పిటిషన్‌ను వెంటనే మంజూరు చేయకుండా ట్రయల్ కోర్టు వివాహాన్ని కాపాడే ప్రయత్నం చేసి ఉండాల్సిందని సెషన్స్ కోర్టు ఆదేశించింది. భార్యాభర్తలు పరస్పర విభేదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని న్యాయమూర్తి కోరారు.

Exit mobile version