Site icon NTV Telugu

Lotus Pond: లోటస్‌ పాండ్‌ వద్ద అపస్మారక స్థితిలో అర్ధనగ్నంగా యువతి..

Lotus Pond

Lotus Pond

Lotus Pond: హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ వద్ద రోడ్డుపై ఓ యువతి అర్ధనగ్నంగా పడి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న యువతికి దుస్తులు వేసి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే యువతిపై అత్యాచారం చేసి రోడ్డుపై పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి వయస్సు 30 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. బాధితురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

Exit mobile version