Site icon NTV Telugu

Video: అకాల నష్టం.. ఎమ్మెల్యే కాళ్ల మీద పడి బోరున ఏడ్చిన మహిళా రైతు

Farmer

Farmer

A woman farmer who fell on MLA’s feet: అకాల వర్షాలు అన్నదాతలను కంటతడి పెట్టిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీరా చేతికొచ్చే సమయానికి వర్షాల వల్ల నాశనమవుతుండడంతో అన్నదాతలు విలవిలపోతున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నీటి పాలు కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్నలు వేడుకుంటున్నారు. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చే పంట నీటిపాలవడంతో పరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Read Also: Truck Loses Control: పెట్రోల్ పంప్ లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. తర్వాత ఏం జరిగిందంటే..

జనగామ జిల్లాలో అకాల వర్షాల వల్ల వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. సోమవారం కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయమని, తమను ఆదుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాళ్ల మీద పడి ఓ మహిళా రైతు బోరున ఏడ్చింది. సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షం వల్ల పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పర్యటించారు. జనగామ మండలం అడవి కేశపూర్‌లో పంటలను పరిశీలిస్తుండగా ఓ మహిళ ఎమ్మెల్యేకు తన బాధలను చెప్పుకుంది. తమని ఆదుకోవాలని, ఎమ్మెల్యే పాదాల మీద బోరున విలపించింది. ఆ మహిళా రైతును ఎమ్మెల్యే ఓదార్చారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని.. ఆ మహిళా కుటుంబానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అక్కడికి తనతో పాటు వచ్చిన అధికారులకు ఆ మహిళకు సాయం అందేలా చూడాలని ఆదేశించారు.

Exit mobile version