Suicide Attempt: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది మహిళ. ఆ మహిళను ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కొండేపూడి జ్యోతిగా గుర్తించారు. అయితే.. ఆ మహిళ ఆత్మహత్యహత్నం కారణం.. ఉప్పే బాపిరాజు అనే వ్యక్తి తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also: Pattabhiram: ఏపీలో సమ్మె చేయని కార్మిక వర్గం లేదు..
ఈ క్రమంలో.. తనకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చింది. దీంతో.. ఆమే కలెక్టర్ ఆఫీసు వద్ద మహిళ తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. కాగా.. తనపై పెట్టిన తప్పుడు కేసులపై దర్యాప్తు చేసి తనకి న్యాయం చేయాలని బాధిత మహిళ కొండేపూడి జ్యోతి కోరుతున్నారు.
Read Also: NTR: సరదా సరదాకే ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తారు.. ఇప్పుడు దేవర గ్లింప్స్ అంటున్నారు.. చూసుకోండి