బంగ్లాదేశ్కు చెందినమహిళ ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్తతో కలిసి జీవించాలనుకుంటున్నానని.. తనను మూడేళ్ల క్రితం ఢాకాలో వివాహం చేసుకున్నట్లు మహిళ పేర్కొంది. తన భర్త నోయిడాలో నివసిస్తున్నట్లు.. ఇప్పుడు తనను విడిచిపెట్టాడని మహిళ పోలీసులకు చెప్పింది. ఆ మహిళను ఢాకాకు చెందిన సోనియా అక్తర్ గా గుర్తించారు.
Read Also: RX 100 Sequel: ‘ఆర్ఎక్స్ 100’ సీక్వెల్ ప్లాన్ బయటపెట్టిన కార్తికేయ
బంగ్లాదేశ్ కు చెందిన సోనియా అక్తర్ ను సూరజ్ పూర్ ప్రాంతంలో నివసిస్తున్న సౌరభ్ కాంత్ తివారీ వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమెను వదిలిపెట్టి ఇండియాకు తిరిగి వచ్చాడు. తివారీకి ఇదివరకే వివాహమైందని బాధిత మహిళ పేర్కొందని అదనపు డీసీపీ రాజీవ్ దీక్షిత్ చెప్పారు. ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు బాధిత మహిళ తన బంగ్లాదేశ్ పౌరసత్వ కార్డుతో పాటు తాను, తన బిడ్డకు సంబంధించిన వీసా, పాస్‌పోర్ట్ వివరాలను అందించినట్లు పోలీసు అధికారి తెలిపారు.
Read Also: Nandamuri Balakrishna: ఇదిరా.. ఒకప్పుడు టాలీవుడ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరభ్ కాంత్ తివారీ బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని ఒక ప్రైవేట్ సంస్థలో 2017 నుండి 2021 వరకు పనిచేశాడు. అక్కడ ఆ మహిళతో ఏర్పడిన ప్రేమతో 2021న ఇస్లామిక్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. సౌరభ్.. అప్పటికే ఒక భారతీయ మహిళతో వివాహం చేసుకున్నాడని.. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంతకుముందు పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్.. తన ప్రియుడిని కలిసేందుకు భారతదేశానికి రాగా.. ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.