Site icon NTV Telugu

Harassment : నల్లగా ఉన్నావని దూషించిన భర్త.. ఊహించని పని చేసిన భార్య

Cirme News

Cirme News

A woman brutally killed her husband

రోజు రోజుకు బంధాలకు విలువ లేకుండా పోతోంది. క్షణికావేశాలకు పోయి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో 30 ఏళ్ల మహిళ తన నల్లని ఛాయపై తరచూ దూషించే తన భర్తను గొడ్డలితో నరికి చంపింది. సంగీత సోన్వానీ చర్మం రంగు నలుపు ఛాయను కలిగి ఉండటంలో భర్త అనంత్ సోన్వానీ ఆమెను దూషిస్తుండేవాడు. అయితే.. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గతంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. గత శనివారం రాత్రి ఇదే విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగడంతో ఆవేశానికి లోనైన సంగీత ఇంట్లో ఉంచిన గొడ్డలితో భర్తపై దాడి చేసి అక్కడికక్కడే హత్య చేసింది. అంతేకాకుండా.. భర్త మర్మాంగాలు కోసేసింది. అమలేశ్వర్ గ్రామంలో తన భర్త అనంత్ సోన్వానీ (40)ని హత్య చేసినందుకు సంగీత సోన్వానీని పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసు సబ్ డివిజనల్ ఆఫీసర్ (పటాన్ ప్రాంతం) దేవాన్ష్ రాథోడ్ తెలిపారు.

 

మొదటి భార్య చనిపోవడంతో బాధితుడు అనంత్ సోన్వానీ నిందితురాలు సంగీత సోన్వానీ పెళ్లి చేసుకున్నాడు. అయితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు సంగీత సోన్వానీ మరుసటి రోజు ఉదయం తన భర్తను ఎవరో హత్య చేశారని చెప్పి గ్రామస్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని, అయితే పోలీసుల విచారణలో నేరం చేసినట్లు అంగీకరించారని వెల్లడించారు. మహిళపై ఐపీసీ సెక్షన్ 302తో పాటు ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయబడిందని, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Exit mobile version