AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య.. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొట్టివాడ పంచాయతీ పరిధిలోని సాలాపు వాని పాలెంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.. స్థానకంగా ఉండే సాలాపు శ్రీనివాస్ రావు (32).. ఏడేళ్ల క్రితం.. దువ్వాడదారి మంగళపాలెంకు చెఇందిన భాగ్యలక్ష్మిని వివాహం చేసుకున్నారు.. కొన్ని సంవత్సరాలు పాటు వీరి సంసారం భాగానే జరిగింది.. మృతుడు సాలాపు శ్రీనివాసరావు.. దామోదర సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీలో ఎలక్ట్రిషన్ గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు.. అయితే, కొంత కాలంగా గళ్ల రవి (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.. అదికాస్తా వివాహేతర సంబధానికి దారి తీసింది.. ఇక, ప్రియుడి మోజులో పడిపోయినభార్య.. శుక్రవారం రాత్రి.. భర్తను రోకలిబండతో కొట్టి చంపేసింది.. భాగ్యలక్ష్మికి ఆమె ప్రియుడుతో పాటు.. మరో వ్యక్తి కూడా.. సహకరించినట్టుగా తెలుస్తోంది.. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సబ్బవరం పోలీసులు.. భార్య భాగ్యలక్ష్మి అదుపులోకి తీసుకున్నారు.. హత్యకు భాగ్యలక్ష్మి ప్రియుడు గళ్ల రవి (24) సహకరించినట్టు గుర్తించారు.. సంఘటన స్థలంలో క్లూస్ టీం పరిశీలించింది.. సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమణ నేతృత్వంలో ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.. ఇక, దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: UP: అజ్మీర్ మసీదులో మతపెద్ద హత్య.. పోలీసుల దర్యాప్తు