NTV Telugu Site icon

Haryana: మరీ ఇంత దారుణమా?.. ఆస్తి కోసం కన్న తల్లిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టిన కూతురు(వీడియో)

Video

Video

హర్యానాలోని హిసార్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తిని తన పేరు మీదకు మార్చుకోవడానికి.. ఓ కూతురు తన తల్లిని దారుణంగా హింసించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు మూడు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో.. ఆ మహిళ తన తల్లి తొడలను సైతం కొరికింది. నీ రక్తం తాగుతానని కూతురు తన తల్లితో చెబుతూ విచ్చల విడిగా దాడి చేసింది.

READ MORE: Nikhila Vimal: టాలీవుడ్ బై చెప్తే మాలీవుడ్ గుండెల్లో పెట్టేసుకుంది!

వైరల్ వీడియోలో కన్న కూతరు తన తల్లిని తీవ్రంగా కొడుతుంది. తల్లి తొడను కొరికి, ఆమెను నేలకేసి కొట్టి.. జుట్టు పట్టుకుని పట్టుకుంది. నొప్పి భరించలేని తల్లి బోరున విలపిస్తున్న కుమార్తెకు కనికరం రాలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లి కొట్టొద్దని దండం పెట్టింది. కానీ ఆ కుమార్తె మాత్రం.. నువ్వు నా చేతుల్లో చనిపోతావు అంటూ చితక బాదింది. తనపై దాడి చేస్తున్న బాధితురాలి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తికి సంబంధించి ఆమె తల్లినొ కొట్టిందని సోదరుడు ఫిర్యాదు చేశాడు.

READ MORE: CM Revanth Reddy: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏటీసీ..

ఈ ఘటన హిసార్‌ ఆజాద్ నగర్‌లోని మోడరన్ సాకేత్ కాలనీలో జరిగింది. తల్లిని కొట్టిన కూతురు పేరు రిటా. రీటాకు రెండేళ్ల క్రితం రాజ్‌గఢ్ సమీపంలోని గ్రామానికి చెందిన సంజయ్ పునియాతో వివాహం జరిగింది. తన భర్తకు ఎలాంటి సంపాదన లేదు. వివాహం తర్వాత.. ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చి ఆస్తి కోసం తన తల్లిని వేధించడం ప్రారంభించింది. ఆ మహిళ కురుక్షేత్రలోని కుటుంబానికి చెందిన పలు ఆస్తులను అమ్మేసి ఇప్పటికే దాదాపు రూ.65 లక్షలు తన దగ్గర ఉంచుకుంది. ఇప్పుడు తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిని తన పేరుమీదకు మార్చాలని డిమాండ్ చేస్తోంది. ఇంటిని పేరు మీద రిజిస్టర్ చేయమని తల్లిని ఇంత దారుణంగా హింసించింది. కాగా.. బాధితురాలి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.