NTV Telugu Site icon

Viral Video: అతి చేయొచ్చు కానీ.. మరి మితిమీరకూడదు..ఒకవేళ చేస్తే ఇలాగే ఉంటాది కాబోలు..!

10

10

హోలీ.. ఎన్నోరంగులను కళ్ళ ముందుకు తెచ్చి సంతోషాలను చూపించే పండుగ హోలీ. హోలీ పండుగ రోజు పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా అందరూ కేరింతలు కొడుతూ పండగ రోజున వివిధ రంగులను పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా నగరాలలో యువతీ యువకులు రంగులతో పెద్ద ఎత్తున సందడి చేయడం మనం చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా నగరాలలో పండుగ రోజు యువత రంగులు పూసుకుని బైకులపై చెక్కర్లు కొడుతుండడం కామన్ గానే చూస్తుంటాం. అచ్చం అలాగే తాజాగా ఓజంట కూడా చేయాలనుకుంది. కాకపోతే కథ కాస్త అడ్డం తిరిగింది. ఓ జంట బైక్ పై స్టంట్ చేసి సోషల్ మీడియాలో పాపులర్ అవుదాం అనుకున్నారా ఏమో తెలియదు గానీ.. వారు చేసిన పనికి మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..

Also read: Delhi Metro: కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ నిరసన.. మెట్రో స్టేషన్లు మూసివేత

ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో తాజాగా జరిగిన సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ యువకుడు బైక్ నడుపుతుండగా బైక్ వెనకాల ఉన్న అమ్మాయి స్టంట్ చేయబోయింది. కాకపోతే అనుకున్న విధంగా కాకుండా మరోలా జరగడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హోలీ సందర్భంగా రంగులు పూసుకున్న తర్వాత ఫోటోలకు ఫోజు ఇవ్వాలనుకున్న సమయంలో ఓ మహిళ బైక్ వెనకాల నిలబడి ఫోటోలు ఇచ్చింది. బైక్ వెనకాల నిలబడిన తర్వాత బండి కదలిచ్చి సడన్ గా బ్రేక్ వేయడంతో దాంతో వెనకాల ఉన్న అమ్మాయి ఒక్కసారిగా బైక్ పైనుంచి కింద పడి బొక్క బోర్లా పడింది. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.

Also read: Apple Layoff : భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న యాపిల్ కంపెనీ..

ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో ఒకరు ‘అయ్యయ్యో.. జాగ్రత్తగా ఉండాలి కదా’ అని అనగా.. మరొకరైతే ‘అతి చేయొచ్చు కానీ.. దానిని మితిమీరకుండా చేసి ఉంటే బాగుండు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ఒకసారి చూసేయండి.