Site icon NTV Telugu

Viral News: జవాన్‌కు తుది వీడ్కోలు పలికిన రెండు నెలల కొడుకు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Jawan

Jawan

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో నక్సలైట్ల దాడిలో 8 మంది డీఆర్‌జీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ జవాన్లకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో సైనికులకు అంతిమ వీడ్కోలు పలికారు. వారి త్యాగానికి నివాళులు అర్పించి, వారి త్యాగం వృథా కాకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేశారు.

READ MORE: Rohit Sharma: రోహిత్‌ శర్మకు లాస్ట్ ఛాన్స్.. పునరావృతం అయితే ఇదే చివరి ఐసీసీ టోర్నీ!

ఈ సమయంలో దంతెవాడలోని గీడం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న జవాన్ సుదర్శన్ వెట్టి రెండు నెలల కుమారుడు తన తండ్రికి చివరి వీడ్కోలు పలికికాడు. ఈ దృశ్యం అందరి హృదయాలను కదిలించింది. వారి సంప్రదాయం ప్రకారం.. చివరి సారిగా బిడ్డను తండ్రి ఒడిలోకి తీసుకున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు జవాన్ అంత్యక్రియలకు హాజరైన.. అందరి కళ్లూ తడిసిపోయాయి. వీరమరణం పొందిన జవాను సుదర్శన్ ధైర్యసాహసాలను ప్రజలు స్మరించుకుని ఆయన త్యాగానికి నివాళులర్పించారు.

READ MORE: Elon Musk: భారత్, చైనా సహా పలు దేశాల్లో జనాభా క్షీణతపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన

ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చారు. వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీరమరణం పొందిన జవాను సుదర్శన్ త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని విష్ణుదేవ్ సాయి ఎక్స్ మీడియాలో పోస్ట్ చేశారు. సైనికుడి త్యాగం వృథా కాదని.. రెండు నెలల చిన్నారి చివరి వీడ్కోలు పలికిన వీడియో హృదయాన్ని కలచివేసిందన్నారు.

Exit mobile version