Site icon NTV Telugu

Bhopal: ఓ ప్రైవేట్ యూనివర్శిటీ ప్రాంగణంలోకి ప్రవేశించిన పులి.. సీసీటీవీలో రికార్డు

Tiger

Tiger

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్శిటీ ప్రాంగణంలోకి పులి ప్రవేశించింది. అందుకు సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో విషయం బయటపడింది. యూనివర్సిటీ గేట్ ముందు అటు ఇటు తిరుగుతూ కనిపించింది. అయితే ఆ ఫుటేజ్ లో కొందరు వ్యక్తులు పక్కనే ఉన్నట్లు తెలుస్తోంది. పులి అక్కడ తిరుగుతున్నంత సేపు వారు భయంభయంగా తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అయితే పులి అక్కడి నుండి వెళ్లిపోగానే వెంటనే ఓ రూంలోకి వెళ్లి తలదాచుకున్నారు. అయితే ఆ పులి సంచరిస్తున్న సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది.

Rudrangi in OTT: 200 సినిమాల్లో రుద్రాంగి టాప్ 10.. ప్రైమ్ లో మిస్ అవ్వద్దంటున్న జగపతిబాబు

మరోవైపు యూనివర్సిటీ క్యాంపస్ కు ఆనుకుని ఉండటంతో పులి యూనివర్సిటిలోకి వచ్చినట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అలోక్ పాఠక్ తెలిపారు. గురువారం రాత్రి పులి యూనివర్సిటీలోకి వచ్చినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు కాగా.. మరోవైపు యూనివర్సిటీలో తక్కువ ఎత్తులో ఉన్న ఫెన్సింగ్ ఉన్నందున దూకి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పులులు, చిరుతలు, సింహాలు.. ఇలాంటి వన్యప్రాణులు జనవాసంలోకి వచ్చి ఇబ్బంది పెడతున్నాయి.

 

Exit mobile version