Site icon NTV Telugu

Heart Attack : గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థిని మృతి..

Srichatanya Collegae Student Susaid

Srichatanya Collegae Student Susaid

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. ఓ ప్రముఖ పాఠశాలలో తొమ్మిదేళ్ల విద్యార్థిని ఆడుకుంటూ గుండెపోటుతో మరణించింది. శుక్రవారం మధ్యాహ్నం.. విద్యార్థిని మధ్యాహ్న భోజనం ముగించుకుని తరగతి గది వైపు వెళుతుండగా.. ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. ఉపాధ్యాయులు పరుగు తీశారు. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

READ MORE: Train Accident : ఈజిప్టులో రెండు రైళ్లు ఢీ.. ముగ్గురు మృతి, 40 మందికి గాయాలు

వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. మోంట్‌ఫోర్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో మూడో తరగతి చదువుతున్న మాన్వి సింగ్ అనే విద్యార్థిని ఆట స్థలంలో అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయిందని పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు ఆమెను సమీపంలోని ఫాతిమా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని కుటుంబసభ్యులు ఆమెను చందన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గుండె ఆగిపోవడంతో బాలిక మరణించిందని ప్రిన్సిపాల్ చెప్పారు. పోలీసులు కూడా ఈ విషయంపై దృష్టి సారించారు. బాలిక మృతి చెందినట్లు సమాచారం అందడంతో శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు.

Exit mobile version