NTV Telugu Site icon

Rajasthan: దొంగతనం తర్వాత నిద్రలోకి జారుకున్న దొంగ.. ఉదయం లేచే సరికి తలక్రిందులుగా..!

Rajasthan

Rajasthan

ఓ దొంగను పట్టుకుని చేతులు, కాళ్లు కట్టేసి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసిన ఘటన రాజస్థాన్‌లోని బుండిలో చోటు చేసుకుంది. ఆ ఊర్లో ఉన్న పొలాల వద్ద నుంచి దొంగ కేబుల్స్ ఎత్తుకెళ్తున్నాడు. ఈ క్రమంలో స్థానికులు అతన్ని దొరకబట్టి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి కొట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. రాత్రి పూట దొంగతనం చేసేందుకు పొలాల దగ్గరకు వెళ్లి కేబుల్స్ ను దొంగిలించాడు. అనంతరం.. మద్యం తాగి అక్కడున్న ఓ గుడిసెలోనే పడుకున్నాడు.. ఉదయం వరకూ అతను నిద్ర లేవలేదు. దీంతో.. ఉదయం గ్రామస్తులు అక్కడికి చేరుకుని పొలాల్లో చోరీకి గురైన కేబుళ్లను అతని సంచిలో నుంచి స్వాధీనం చేసుకున్నారు. దొంగతనంపై కోపంతో స్థానికులు హన్సరాజ్ అనే దొంగను కొట్టి.. గ్రామానికి తీసుకువచ్చి చెట్టుకు కట్టేశారు. అనంతరం కర్రలతో కొట్టారు. ఈ విషయంపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల బారి నుంచి దొంగను రక్షించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Manchu Manoj: పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్.. మళ్ళీ తండ్రిపై ఫిర్యాదు

ప్రాథమిక విచారణ తర్వాత.. హన్సరాజ్‌ను మరో పోలీసు స్టేషన్ అధికారులు వెతుకుతున్నారని.. అతన్ని వారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో తరచుగా దొంగతనాలు జరుగుతుండటంతో గ్రామాలు విసుగు చెందారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు. ఈ క్రమంలో అప్రమత్తమైన గ్రామస్తులు కేబుల్ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీశారు.