Hyderabad Road Accident: లంగర్‌హౌస్‌లో ఇద్దరు.. చర్లపల్లిలో ఒక చిన్నారి మృతి
- హైదరాబాద్ లో ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం
- లంగర్‌హౌస్ పీఎస్ పరిధిలో స్కూటర్‌ను ఢీకొట్టిన అనంతరం ఆటోని ఢీకొట్టిన కారు
- టూవీలర్ వాహనంపై ప్రయాణిస్తున్న భార్యభర్తలు అక్కడికక్కడే మృతి
- చర్లపల్లిలో కారు ఢీకొని చిన్నారి ఆధ్య (9) మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిలో కారు.. స్కూటర్‌ను ఢీకొట్టిన అనంతరం ఆటోని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్ వాహనంపై ప్రయాణిస్తున్న భార్యభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణం కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమేనని పోలీసులు అంటున్నారు.
Read Also: Off The Record: తెలంగాణ బీజేపీలో రిపేర్ వర్క్ మొదలైందా..?
Also Read
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
మరోవైపు.. కారు ఢీకొని చిన్నారి ఆధ్య (9) మృతి చెందిన ఘటన చర్లపల్లి డివిజన్లో జరిగింది. ప్రమాదవశాత్తు కారు ఢీకొని చిన్నారి మృతి చెందింది. ఘట్కేసర్ మండలం మేడిపల్లికి చెందిన బంటు రమేష్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం చర్లపల్లిలోని బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు ఆయన, భార్య, కూతురు ఆధ్యతో కలిసి హాజరు అయ్యారు. సాయంత్రం చిన్నారి ఆద్య ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వేడుకలకు వచ్చిన ఓ బంధువు రివర్స్ చేస్తుండగా కారు ఢీ కొట్టడంతో చిన్నారికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో.. వెంటనే చిన్నారిని ఈసీఐఎల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Read Also: Off The Record: దీక్షా దివస్ వెనుక BRS అధిష్టానం వ్యూహమేంటి.?
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!