తెలంగాణలో మరో ఘోరం చోటు చేసుకుంది. సీఎంఆర్ కాలేజ్ ఘటన మరువకముందే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయి జీవితానికి రక్షణ లేకుండా పోయింది. ఓ కామాంధుడు ఇంజనీరింగ్ చదివే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరం శివారులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో మరోసారి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే……
Read Also: Champions Trophy 2025: ఇండియాకు నో ఛాన్స్.. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచేది ఆ జట్టే..?
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఇంజనీర్ కాలేజ్ హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థిని పై అత్యాచారానికి పాల్పడ్డాడు డ్రైవర్.. హాస్టల్‌లో దూరి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించాడు. కాలేజీ యజమాని డ్రైవరే ఈ ఘటనకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున హాస్టల్లోకి దూరి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Brahmanandam: బ్రహ్మానందానికి శేఖర్ కమ్ముల ఇంత దగ్గరి చుట్టమా?