హాస్టల్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ముఖర్జీ నగర్లోని ఓ పీజీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని ఈరోజు తెల్లవారుజామున సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని చేరుకుని పరిశీలించారు. తెల్లవారుజామున 3.20 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతురాలు 29 ఏళ్ల స్వాతిగా గుర్తించారు. రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు.
Read Also: Thangalaan: ఇదే కదా కావాల్సింది.. గూజ్ బంప్స్ తెప్పిస్తున్న తంగలాన్ గ్లింప్స్
వివరాల్లోకి వెళ్తే.. మృతురాలు స్వాతి మీరట్‌లోని బధ్లా గ్రామ నివాసి. స్వాతి తండ్రి ఓ సామాన్య రైతు.. స్వాతి గత పదేళ్లుగా ఢిల్లీలో చదువుకుంటుందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలోనే.. ఆమె పలుచోట్ల పీజీలు కూడా ఛేంజ్ అయిందని బాలిక పేరెంట్స్ పోలీసులకు తెలిపారు. కాగా.. ప్రియం అనే అమ్మాయితో కలిసి ఒకే రూమ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు గల కారణాలపై ప్రియమ్ ను కూడా విచారిస్తున్నారు.
Read Also: IPL 2024: ఐపీఎల్ మ్యాచ్లపై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు.. అది సరికాదు..!
మృతురాలు ఖాళీ సమయంలో రీల్స్ చేస్తుండేది. అంతేకాకుండా.. ఓ యూట్యూబ్ ఛానెల్‌ని కూడా నడిపించేదని స్నేహితులు చెబుతున్నారు. మరోవైపు.. విద్యార్థిని మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. పీజీలో ఉంటున్న ఇతర విద్యార్థినులను పోలీసులు విచారించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
